“సై రా నరసింహ రెడ్డి” టీం కి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి

523

“సైరా నరసింహారెడ్డి” ఈ మూవీ గ్రాండ్ గా ఎప్పుడో పూజ కార్యక్రమాలతో మొదలయింది. చిరంజీవి హీరో గా రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయబోతున్నాడు. అసలైతే ఈ మూవీ ఎప్పుడో సెట్స్ మీదకి వెళ్ళాలి, కాని ఇప్పటి వరకు ఈ మూవీ ఇంకా సెట్స్ మీదకి వెళ్ళలేదు. అసలు నరసింహారెడ్డి కథని పరుచూరి బ్రదర్స్ ఎప్పుడో రాసారు. చిరంజీవి సూచనల మేరకు కొన్ని మార్పులు కూడా చేసారు. కానీ ఇప్పుడు రైటర్ గా వెలుగులోకి వచ్చిన రచయిత సాయి మాధవ్ బుర్రాని కూడా తీసుకొచ్చి స్క్రిప్ట్ లో కూర్చోబెట్టరట. ఇప్పుడు అక్కడే ఈ మూవీ టీం కి తేడా కొట్టింది . ఇక్కడ పరుచూరి బ్రదర్స్ స్క్రీన్ ప్లే ఒకలా ఉంటే సాయి మాధవ్ బుర్రా స్క్రీన్ ప్లే మరోలా ఉంది. దాంతో దర్శకుడు సురేందర్ రెడ్డి కి పరుచూరి బ్రదర్స్ కు తేడా లు వచ్చాయి. ఈ విషయం మెగాస్టార్ చిరంజీవి వరకు వెళ్ళడంతో అందరికీ క్లాస్ పీకాడట చిరంజీవి. అంతేకాదు ఇంకో పది రోజుల్లో అసలు విషయం చెప్పమని గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చాడట చిరంజీవి. దాంతో ఇప్పుడు చేసేది లేక “సై రా” టీం మొత్తం స్క్రిప్ట్ ని లాక్ చేసే పనిలో ఉంది.

NEWS UPDATES

CINEMA UPDATES