మనోజ్ ప్రభాకర్ పై చర్యలు తీసుకోవాలి

721

టాలీవుడ్ హీరో మహేష్ బాబును అనరాని మాటలన్న తమిళ కమెడియన్ మనోజ్ ప్రభాకర్ పై తక్షణం చర్యలు తీసుకోవాలని నడిగర్ సంఘాన్ని, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోరింది. ఈ మేరకు మా అసోసియేషన్ నుంచి నడిగర్ సంఘానికి ఓ లేఖ పంపించారు.

3 రోజుల కిందట మహేష్ పై మనోజ్ ప్రభాకర్ పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మహేష్ ముఖం రాయిలా ఉంటుందని, అతడికి ఎక్స్ ప్రెషన్ పండించడం కూడా రాదని విమర్శించాడు మనోజ్ ప్రభాకర్. అంతటితో ఆగకుండా మహేష్ ను మగ కత్రినాకైఫ్ అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడాడు.

దీనిపై మహేష్ ఫ్యాన్స్ చాలా సీరియస్ అయ్యారు. 2 రోజులుగా మనోజ్ ప్రభాకర్ ను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి మనోజ్ ఇప్పటికే రియాక్ట్ అయ్యాడు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని, క్షమించాలని వేడుకున్నాడు. అయినప్పటికీ మహేష్ ఫ్యాన్స్ శాంతించలేదు. ఈ నేపథ్యంలో మా అసోసియేషన్, నడిగర్ సంఘానికి లేఖ రాయడంతో ఈ వివాదం ఇప్పుడు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

NEWS UPDATES

CINEMA UPDATES