సమంతా గొంతు పై తీవ్ర విమర్శలు

804

అక్కినేని సమంతా తోలి సారి లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించింది. ఆ సినిమానే “యు టర్న్”. కన్నడ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా వినాయాక చవితి సంధర్బంగా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే సినిమా అంతా బానే ఉన్న కూడా సమంతా గొంతు విషయంలో మాత్రం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సినిమాలో సమంతా సొంత డబ్బింగ్ చెప్పుకుంది.

అయితే ఇప్పుడు ఆ సొంత డబ్బింగ్ వల్లే సినిమా లోని కొన్ని మాటలు అర్ధం కావట్లేదు అనే విమర్శలు వస్తున్నాయి. సమంతా ఇదివరకు “మహానటి” కూడా సొంత గొంతే వాడుకుంది. కానీ ఈ సినిమాకి వచ్చే సరికి థ్రిల్లర్ కాబట్టి సమంతా వాయిస్ సెట్ అవ్వలేదు. ఒకవేళ సమంతా కి ఎప్పుడూ డబ్బింగ్ చెప్పే చిన్మయి డబ్బింగ్ చెప్పి ఉంటే సినిమా ఈరోజు వేరే లెవెల్ లో ఉండేది అన్న వారు లేకపోలేదు. ఏదేమైనా సమంతా వాయిస్ విషయంలో తప్పిస్తే సినిమా మొత్తం బానే ఉంది అనే టాక్ ఉంది. మరి తదుపరి సినిమాకి ఇలాంటి తప్పు జరగకుండా సమంతా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి.

NEWS UPDATES

CINEMA UPDATES