జూనియర్ ఐశ్ పై ట్వీట్…. అభిషేక్ స్ట్రాంగ్‌ కౌంటర్

410

ఐశ్వర్యారాయ్…. ఆరాధ్య. తల్లీకూతుళ్లు అయిన ఈ ఇద్దరూ…. ఇప్పుడేం చేసినా…. ఓ వార్తే. ఇద్దరూ కలిసి ఓ ఫొటోకు పోజిచ్చినా వార్తే. అనాథ శరణాలయంలో సేవా కార్యక్రమాలు చేసినా వార్తే. ఇదే.. ఇప్పుడు బచ్చన్ కుటుంబానికి కాస్త చికాకు తెప్పిస్తున్నట్టు అనిపిస్తోంది. అసలు విషయం ఏంటంటే.. ఈ మధ్య.. ఆరాధ్య, ఐశ్వర్యరాయ్ కలిసి ఓ వేడుకకు హాజరయ్యారు.

తల్లీకూతుళ్లు ఇద్దరూ.. అదిరిపోయే రెడ్ కలర్ డ్రెస్ లో సేమ్ టూ సేమ్ మేకోవర్ అయ్యారు. ఆ వేడుకలో అందరి చూపు.. ఆ ఇద్దరిపైనే అన్నంతగా తయారయ్యారు. చివరికి.. వాళ్లిద్దరి పిక్స్ సోషల్ మీడియాలోనూ ఎంట్రీ ఇచ్చాయి. ఇది చూసి.. అభిమానులు ప్రేమగా.. మిగతావారు మరోలా ట్వీట్లు చేసేయడం మొదలు పెట్టారు. ఇందులో ఒకరి ట్వీట్ కు.. అభిషేక్ బచ్చన్ కాస్త సీరియస్ గా రిప్లై ఇచ్చాడు.

“ఆరాధ్య అందంగా ఉంటే సరిపోతుందా.. ఆమెను స్కూలుకు పంపించరా.. అసలు అన్ని సెలవులు ఎలా ఇస్తున్నారు ఆరాధ్యకు? ఎప్పుడూ ఆమె తల్లితోనే ఉంటుందా?” అంటూ ఓ యువతి ట్వీట్ చేసింది. దీంతో.. ఆగ్రహానికి గురైన అభిషేక్.. “మేడం.. మా ఆరాధ్య రోజూ స్కూలుకు వెళ్తుంది. వీకెండ్ లో ఫంక్షన్లకు తల్లితో కలిసి హాజరవుతోంది. మా వైపు ఏమీ తప్పు లేదు.. మీ ట్వీట్ లోనే తప్పుంది” అంటూ రిట్వీట్‌ చేశాడు. ఈ దెబ్బకు… ఆ యువతి నుంచి జవాబే కరువైంది.

 

NEWS UPDATES

CINEMA UPDATES