చైల్డ్ అబ్యూస్‌…. మ‌నిషిలో ప‌శుత్వానికి నిద‌ర్శ‌నం…. పిల్ల‌ల్ని ఎవ‌రి చేతిలోనూ పెట్ట‌కండి

5661

”చిన్న పిల్ల‌ల్ని ఎవ‌రికీ అప్ప‌గించ‌కండి, ముఖ్యంగా ఆడ‌పిల్ల‌ల్ని…. చిన్న పాపాయిని పెద్దాయ‌న చేతిలో పెట్టి నిశ్చింత‌గా ఉండ‌డం అంత అవివేకం మ‌రొక‌టి ఉండ‌దు” ఈ మాట‌ల‌న్న‌ది బాలీవుడ్‌ సీనియ‌ర్ న‌టి డైసీ ఇరానీ. ఆమె చైల్డ్ ఆర్టిస్టుల త‌ల్లిదండ్రుల‌కు ఈ హెచ్చ‌రిక చేశారు. అందుకు త‌న జీవితాన్నే ఉదాహ‌ర‌ణ‌గా చెప్పారామె.

ఆరేళ్ల వ‌య‌సులో త‌న‌ అంకుల్ రేప్ చేశాడ‌ని బ‌య‌ట‌పెట్టారామె. త‌న త‌ల్లి షూటింగ్ పంపించేట‌ప్పుడు ఆయ‌న‌ను తోడుగా పంపించేద‌ని, ఆ తోడుగా వ‌చ్చిన వాడే ప‌రాయి ప్ర‌దేశంలో త‌నను బెల్ట్‌తో కొట్టి మ‌రీ త‌న‌ మీద అత్యాచారం చేయ‌డంతోపాటు బ‌య‌ట‌కు చెప్తే చంపేస్తాన‌ని బెదిరించాడ‌ని ఆమె ఆవేద‌న చెందారు.

ఆ సంగ‌తి చాలా రోజుల త‌ర్వాత… త‌ల్లికి చెప్పాన‌ని, అప్ప‌టి నుంచి త‌ల్లి త‌న చెల్లెళ్ల విష‌యంలో మ‌రీ ఎక్కువ జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ద‌ని చెప్పారామె. త‌ల్లి త‌మ‌ను వెండితెర స్టార్ల‌ను చేయాల‌నే విప‌రీత‌మైన వ్యామోహంతో ఉండేద‌ని కూడా అన్నారు.

డైసీ ఇరాని బాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్టుగా బూట్ పాలిష్‌, జ‌గ్తే ర‌హో, న‌యా దౌర్ సినిమాల‌లో న‌టించింది. మ‌ద్రాస్‌లో హ‌మ్ పంచి ఏక్ దాల్ కే షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు త‌ల్లి త‌న‌తో రాలేక గార్డియ‌న్‌గా అంకుల్ నాజ‌ర్‌ను పంపించింద‌ని అత‌డు ఈ దురాగ‌తానికి పాల్ప‌డ్డాడ‌ని ఆమె చెప్పుకొచ్చారు.

అర‌వై ఏళ్ల కిందట జ‌రిగిన చేదు అనుభ‌వాన్ని ఇప్పుడు పంచుకోవ‌డంలో త‌న ఉద్దేశం… త‌న‌ అనుభ‌వంతో ఈ త‌రం త‌ల్లులు త‌మ పిల్ల‌ల‌ను షూటింగ్‌ల‌కు పంపించేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా ఉండాల‌నేదేన‌న్నారు. గుడ్డిగా ఎవ‌రినీ న‌మ్మ‌వ‌ద్ద‌ని హిత‌వు ప‌లికారు.

NEWS UPDATES

CINEMA UPDATES