దావూద్ ఆస్తుల‌ వేలం…. 11 కోట్లకు

371

అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీం ఆస్తులు ఎట్ట‌కేల‌కు అమ్ముడు పోయాయి. ద‌క్షిణ‌ ముంబైలో మూడు ప్ర‌ధాన ఆస్తుల‌ను ఎస్‌బియూటి అనే సంస్థ 11 కోట్ల‌కు కొనుగోలు చేసింది.

సైఫీ బుర్హానీ అప్‌లిఫ్ట్‌మెంట్ ట్ర‌స్ట్ (ఎస్‌బియూటి) కొనుగోలు చేసింది. బిడ్లు స‌మ‌ర్పించి వేలంలో దావూద్ ఆస్తుల‌ను ద‌క్కించుకున్న‌ట్లు ఎస్‌బియూటి ప్ర‌తినిధి ఒక‌రు మీడియాకు వివ‌రించారు.

ఒక రెస్టారెంట్‌, రౌన‌క్ అఫ్రోజ్ అనే హోట‌ల్‌, ష‌బ్‌న‌మ్ గెస్ట్‌హౌజ్ లు ఎస్‌బియూటి స్వాధీనం కానున్నాయి. వేలం వేసిన ఆస్తుల‌న్నీ ఒక కిలోమీట‌ర్ పరిధిలోనే ఉన్నాయి. బెందీ బ‌జార్ ప్రాంతంలో దావూద్‌తో పాటు క‌ష్క‌ర్ కుటుంబీకులు ఈ ఆస్తుల‌ను క‌లిగి ఉండేవారు.

1993 లో ముంబై పేలుళ్ల అనంత‌రం దావూద్ దేశం వ‌దిలి పారిపోవ‌డంతో ఆ ఆస్తుల‌ను ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకుంది. అప్ప‌టి నుంచి చాలా సార్లు అమ్మ‌డానికి చేసిన ప్ర‌య‌త్నాలు వృథా అయ్యాయి. ఈ సారి ఎస్‌బియూటి ముందుకు వ‌చ్చింది.

NEWS UPDATES

CINEMA UPDATES