ఉచిత భోజన…. స్వాతి అరెస్ట్

2173

ఢిల్లీ పోలీసులు ఒక ఆసక్తికరమైన కేసును నమోదు చేశారు. ఐదేళ్లుగా ఢీల్లీ లోని రెస్టారెంట్ లను బురిడీ కొట్టించి ఉచితంగా రోజూ వచ్చి భోజనాలు లాగిస్తున్న స్వాతి అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.

తాను ఫుడ్ బ్లాగ్ నడుపుతున్నాను అని , మీ రెస్టారెంట్ లో ఫుడ్ గురించి పాజిటివ్ గా రివ్యూ రాస్తానంటూ నమ్మించేది. అది నమ్మి హోటల్స్ వారు ఆమెకు రాచమర్యాదలు చేసేవారు. ఇంటికి కూడా పార్సిల్ పంపేవారు.

ఇలా ఐదేళ్లుగా స్వాతి పైసా ఫుడ్ ఖర్చు లేకుండా బ్రతికేస్తూ వస్తోంది. కానీ అనుమానం వచ్చిన ఒక హోటల్ యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఈమెను అరెస్ట్ చేసిన పోలీసులు విచారించారు. అప్పుడు తెలిసింది… ఆమెకు ఫుడ్ బ్లాగ్ లేదు… ఇప్పటివరకు ఆమె ఒక్క ఆర్టికల్ రాసింది లేదు. కేవలం హోటల్స్ వారిని బురిడీ కొట్టించేందుకు ఈ ఎత్తు వేసింది.

NEWS UPDATES

CINEMA UPDATES