“డిటెక్టివ్ 2” స్టార్ట్ చేయబోతున్న విశాల్

319

స్వతహాగా తెలుగు వాడు అయిన విశాల్ తెలుగు లో కంటే కూడా తమిళ్ లో హీరో గా ఎక్కువ మార్కెట్ ని క్రియేట్ చేసుకొని స్టార్ హీరో గా ఎదిగాడు. ఇటు తెలుగు లో కూడా విశాల్ కి మంచి మార్కెట్ ఉంది. విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ అయిన “తుప్పరివాలన్” మూవీ తమిళ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకొని తెలుగు రాష్ట్రాల్లో కూడా 400లకు పైగానే స్క్రీన్లలో “డిటెక్టివ్” పేరుతో గత శుక్రవారం విడుదలై మంచి టాక్ తో నడుస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

అయితే ఈ మూవీ విజయం ఇప్పుడు విశాల్ కు మరింత ఉత్సాహాన్నిచ్చింది. దీంతో ఆయన ఈ మూవీ కి సీక్వెల్ గా “డిటెక్టివ్-2” ను ప్లాన్ చేయాలనీ డిసైడ్ అయ్యాడు అంట. ఈ నేపథ్యంలో ఈ సీక్వెల్ కి సంబంధించిన ఒక అధికారిక ప్రకటనని త్వరలో చేయనున్నాడట విశాల్. వచ్చే ఏడాది లో మొదలుకానున్న ఈ మూవీ ని కూడా తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ఇది కూడా పూర్తిగా డిటెక్టివ్ తరహా నైపథ్యంలోనే, థ్రిల్లింగ్ గా ఉండనుందని తెలుస్తోంది. కేవలం హీరో పాత్ర మాత్రమే “డిటెక్టివ్” లాగ ఉంటుంది అని మిగతా స్టొరీ మొత్తం కొత్తగా ఉంటుంది అని విశాల్ చెప్పుకొచ్చాడు. విశాల్ నిర్మాతగా వ్యవహరించనున్న ఈ మూవీ ని మిస్కిన్ డైరెక్ట్ చేస్తాడట.

NEWS UPDATES

CINEMA UPDATES