హాలీవుడ్ మూవీపై కన్నేసిన ఎ.ఆర్.మురుగదాస్

209
director murugadoss million dollar baby remake akshay kumar marina boxing

రీసెంట్ గా “స్పైడర్”తో ఆడియన్స్ ముందుకి వచ్చాడు ఎ.ఆర్.మురుగదాస్. “స్పైడర్” మూవీ ఎ.ఆర్.మురుగదాస్ కెరీర్ లోనే వన్ అఫ్ ది బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలిచింది. అయితే ఈ మూవీ తరువాత తమిళ్ హీరో అయినా విజయ్ హీరోగా ఒక ప్రాజెక్ట్ ని మొదలుపెట్టనున్నాడు మురుగదాస్. ఈ మూవీ జనవరిలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసుకోబోతుంది. ఇదిలా ఉంటె ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాకముందే ఇంకో మూవీని స్టార్ట్ చేసాడు మురుగదాస్.

అయితే ఈ సారి హాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యి ఆస్కార్ అవార్డ్స్ ని సొతం చేసుకున్న “మిలియన్ డాలర్ బేబీ” పై మురుగదాస్ కన్ను పడింది. అవును ఈ మూవీని బాలీవుడ్ లో రీమేక్ చేయనున్నాడు మురుగదాస్. ఒక కోచ్ ఒక పేద అమ్మాయికి బాక్సింగ్ లో ట్రైనింగ్ ఇచ్చి ఆ అమ్మాయిని ఇంటర్నేషనల్ బాక్సర్ ని చేస్తాడట. కోచ్ రోల్ లో అక్షయ్ కుమార్ నటిస్తుండగా ఆ పేద అమ్మాయి రోల్ లో మెరీనా కుమార్ నటిస్తుంది అంట. మొత్తానికి “స్పైడర్” మూవీతో ప్లాప్ తెచ్చుకున్న గాని బాలీవుడ్ ఆఫర్ ని భలే పట్టాడు మురుగదాస్.

NEWS UPDATES

CINEMA UPDATES