దిల్ రాజు “శ్రీనివాస కళ్యాణం” కి హీరో దొరికేసాడు

383

దిల్ రాజు ఈ ఏడాది స్టార్టింగ్ లో “శతమానంభవతి” అంటూ వచ్చి మంచి ఫ్యామిలి సక్సెస్ ని అందుకొని దాంతో పాటు నేషనల్ అవార్డుని అందుకున్నాడు. అయితే ఈ మూవీ ని డైరెక్ట్ చేసిన సతీష్ వేగ్నేశ్‌ కి దిల్ రాజు తన బ్యానర్ లో ఇంకో మూవీ తీసే అవకాశం ఇచ్చాడు. సతీష్ వేగ్నేశ్‌ కూడా దిల్ రాజు నుంచి మరో అవకాశం రాగానే “శ్రీనివాస కళ్యాణం” అని మరో క్లాస్ ఫ్యామిలీ స్టొరీ ని రెడీ చేసుకున్నాడు. మొదట ఈ కథని దిల్ రాజు కింగ్ నాగార్జున కి వినిపించాడు. కాని నాగార్జున కి డేట్స్ ప్రాబ్లం రావడం వల్ల ఆ కథ నచ్చినా గాని నో చెప్పాడు.

ఇక మళ్ళీ దిల్ రాజు అదే కథని జూనియర్ ఎన్టీఆర్ కి తీసుకొని వెళ్లి సతీష్ తో చెప్పించాడు. జూనియర్ ఎన్టీఆర్ కి కూడా కథ బాగా నచ్చింది కాని సతీష్ మీద నమ్మకం లేకపోవడం వల్ల మూవీ కి నో చెప్పాడు ఎన్టీఆర్. అయితే ఇద్దరు స్టార్ హీరోస్ రిజెక్ట్ చేసిన ఈ సినిమా ని ఇప్పుడు ఒక యంగ్ హీరో ఓకే చెప్పాడు. అవును రీసెంట్ గా ఈ కథ విన్న నితిన్ ఈ మూవీ చేయడానికి ఓకే చెప్పాడు అని తెలుస్తుంది. త్వరలో ఈ మూవీ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ బయటకి వస్తాయి.

NEWS UPDATES

CINEMA UPDATES