విదేశీ విద్య‌కు బీరు చిట్కా

437

విదేశీ విద్య‌ల‌ను సుల‌భంగా నేర్చుకోవాలంటే కాస్త బీరు పుచ్చుకుంటే బెట‌ర్ అని అంటుంది ఒక స‌ర్వే. కాస్త బీరు తాగితే ఆందోళ‌న త‌గ్గి ఆత్మ విశ్వాసం పెరుగుతుంద‌ని పేర్కొంది.

ఆ సంద‌ర్భంలో ఎవ‌రైనా వ్య‌క్తితో మాట్లాడితే భాష త‌డ‌బ‌డ‌కుండా బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని లివ‌ర్‌పూర్ యూనివ‌ర్సిటీకి చెందిన ఇంగే కెర్స్‌బ‌ర్గ‌న్ తెలిపారు.

కొత్త‌గా విదేశీ భాష నేర్చుకుని మాట్లాడ‌డానికి భ‌య‌ప‌డే వారికి ఈ విధానం స‌రిగ్గా స‌రిపోతుంద‌ని ఆయ‌న వివ‌రించారు.

ఇప్ప‌టికే ఈ విధానం చాలా మంది పాటిస్తున్నారు. ఫ‌లితాలు పొందుతున్నారు. ఒక ప్ర‌ఖ్యాత‌ యూనివ‌ర్సిటీకి చెందిన ప్రొఫెస‌ర్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించ‌డంతో వారికి మ‌రింత బ‌లం చేకూరింది.

సైకో ఫార్మ‌కాల‌జీ అనే జ‌ర్న‌ల్‌లో ఈ రిసెర్చ్ ఫ‌లితాలు ప్ర‌చురించ‌బ‌డ్డాయి.

70 కేజీల బ‌రువు క‌లిగిన కొంద‌రి పురుషుల‌పై ఈ ప్ర‌యోగాన్ని చేశారు. వారికి 460 ఎం.ఎల్ బీరును అందించారు.

డ‌చ్ భాష నేర్చుకున్న వీరంతా బీరు తాగిన త‌ర్వాత ఆ భాష‌ను ఎటువంటి బెరుకు లేకుండా చాలా చ‌క్క‌గా మాట్లాడారు.

ఉచ్ఛార‌ణ దోషాలు కూడా లేకుండా ఎంతో బాగా సంభాషించారు.

ఈ విష‌య‌మై ఇంకా పూర్తిస్థాయిలో ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయ‌ని అప్పుడే మ‌రిన్ని విష‌యాలు వెల్ల‌డించ‌డం సాధ్య‌ప‌డుతుంద‌ని రీసెర్చ్ తెలిపింది.

NEWS UPDATES

CINEMA UPDATES