విశాల్‌కు మళ్లీ షాక్

891

తమిళనాడు ఆర్కే నగర్‌ ఉప ఎన్నికల నామినేషన్ల పర్వంలో హైడ్రామా కొనసాగింది. నటుడు విశాల్ నామినేషన్‌ తిరస్కరణకు గురై…. ఆ తర్వాత ఆమోదం పొంది…. తిరిగి చివరకు తిరస్కరణకు గురైంది. విశాల్‌ను బలపరుస్తూ నామినేషన్‌పై 10మంది సంతకాలు చేయగా…. వాటిలో కొన్ని సరిగా లేవంటూ తొలుత నామినేషన్ తిరస్కరించారు. దీంతో విశాల్ అధికారుల తీరును నిరసిస్తూ ధర్నాకు దిగారు. అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. దీంతో విశాల్‌ నుంచి వివరణ తీసుకున్న అధికారులు తొలుత నామినేషన్‌ను ఆమోదించారు.

అయితే విశాల్ ఇచ్చిన వివరణలో నిజం లేదంటూ రాత్రి 11 గంటల సమయంలో అతడి నామినేషన్ ను తిరస్కరిస్తున్నట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. జయలలిత మేనకోడలు దీప నామినేషన్‌ను కూడా అధికారులు తిరస్కరించారు. తన నామినేషన్‌ తిరస్కరణపై విశాల్ కోర్టును ఆశ్రయించేందుకు సిద్దమవుతున్నారు. ఆర్కేనగర్‌ ఉప ఎన్నిక పోరులో మొత్తం 131 మంది నామినేషన్లు వేయగా పరిశీలనలో 54 తిరస్కరణకు గురయ్యాయి.

NEWS UPDATES

CINEMA UPDATES