ఈ క్లబ్‌ డ్యాన్సులేంటి గంటా?

1026

కార్యక్రమం ఏదైనా సరే ఐటమ్ సాంగ్‌ లేకుంటే అధికార పార్టీ నేతలకు ముద్ద దిగేలా లేదు. చివరకు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో సైతం ఐటమ్ సాంగ్స్‌తో నివాళులర్పించే కళాపోషణ ఆ పార్టీ నేతల సొంతం. జన్మభూమి ప్రారంభం రోజు, ముగింపు రోజు కూడా క్లబ్ డ్యాన్స్‌లతో తైతక్కలాడి ఆశ్చర్యపరిచిన ఖ్యాతి తెలుగు తమ్ముళ్ల సొంతం. తాజాగా మంత్రి గంటా శ్రీనివాస్ ముందు విద్యార్థినుల ఐటమ్ సాంగ్ నృత్యాలు వివాదాస్పదంగా మారాయి.

విశాఖలో జరిగిన సైన్స్‌ ఫెయిర్‌కు హాజరైన మంత్రిని ఆనందింపచేసేందుకు విద్యాశాఖ అధికారులు విద్యార్థినులతో ఐటమ్ సాంగ్స్‌ కు డ్యాన్సులు వేయించారు. నీ ఇల్లు బంగారం గాను.. నా ఒళ్లు సింగారం గాను లాంటి జ్యోతిలక్ష్మిపాటలకు అమ్మాయిలతో డ్యాన్స్ వేయించారు. ఎలాంటి పాటలకు తాము డ్యాన్సులు వేస్తున్నామో కూడా నిర్ధారించుకోలేని విద్యార్థినులు మంత్రి సమక్షంలో స్టెప్పులేశారు. మంత్రి కాళ్ల వద్దకు వచ్చి అమ్మాయిలు డ్యాన్స్‌ చేస్తున్న దృశ్యాలు చూసేందుకే ఇబ్బందిగా కనిపించాయి. ఒక లైలా కోసం తిరిగాను లోకం లాంటి పాటలకు విద్యార్థినులతో డ్యాన్స్‌లు వేయిస్తున్నా గంటా మాత్రం చూస్తూ ఉండిపోయారే గానీ.. ఇలాంటి పాటలకు స్టూడెంట్స్‌ చేత డ్యాన్సులు వేయించడం ఏంటి అని మాత్రం గంటా శ్రీనివాసరావు ప్రశ్నించలేదు.

NEWS UPDATES

CINEMA UPDATES