మా నారాయ‌ణ అమాయ‌కుడు…. అంతా మీరే చేశారు….

1051

నారాయ‌ణ‌, శ్రీచైత‌న్య‌కు మరోసారి అభ‌య‌మిచ్చింది ఏపీ ప్ర‌భుత్వం. ఇక‌పై ఆ కాలేజీల్లో విద్యార్థులు ఉరేసుకుని చ‌నిపోయినా స‌రే కాలేజీల‌కు వ‌చ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ర్యాంకుల కోసం పిల్ల‌ల‌ను రాచిరంపాన పెట్టినా మాట్లాడానికి వీల్లేదు. కార్పొరేట్‌ కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై అసెంబ్లీ శీతాకాల సమా వేశాల్లో కొందరు సభ్యులు చర్చను కోరుతుండడంతో ప్రభుత్వం ఒక‌ నివేదికను రూపొందించింది. కార్పొరేట్ కాలేజీలో విద్యార్థుల చావుల‌కు కాలేజీ యాజ‌మాన్యాలు కార‌ణం కానేకాద‌ని.. నారాయ‌ణ వియ్యంకుడు గంటాశ్రీనివాస్ న‌డుపుతున్న విద్యాశాఖ తేల్చేసింది. త‌ల్లిదండ్రుల వ‌ల్లే కాలేజీల్లో విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నార‌ని ప్ర‌భుత్వం తీర్మానించింది. హాస్టళ్లలో ఉండటం ఇష్టం లేని విద్యార్థులను హాస్టళ్లలోనే ఉండాల్సిందిగా తల్లిదండ్రులు ఒత్తిడి చేయడం, ఎక్కువ మార్కులు, టాప్‌ ర్యాంకులు తెచ్చుకోవాలని బలవంత పెట్టడం, మొదటి సంవత్సరంలో ఫెయిల్‌ కావడం, కుటుంబ, వ్యక్తిగత కారణాల వల్లే విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని తన నివేదికలో స్పష్టం చేసింది.

ఈ నివేదిక‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. విద్యాప్ర‌మాణాలు పాటించ‌కుండా ఇరుకు గ‌దుల్లో, బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాల్లో విద్యార్థుల‌ను కుక్కి తెల్ల‌వారుజాము నుంచి అర్థ‌రాత్రి వ‌ర‌కు విద్య‌ పేరుతో హింసిస్తున్న కాలేజీల‌కు విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల్లో ఎలాంటి ప్ర‌మేయం లేద‌ని ప్ర‌భుత్వమే ప్ర‌క‌టించ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. కేవ‌లం నారాయ‌ణ‌, శ్రీచైత‌న్య లాంటి కార్పొరేట్ కాలేజీల్లోనే ఈ ఆత్మ‌హ‌త్య‌లు ఎందుకు జ‌రుగుతున్నాయ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. క‌నీసం కాసేపు ఆడుకునేందుకు ప్లే గ్రౌండ్ కూడా లేని కార్పొరేట్ కాలేజీల ఆరాచ‌కం వ‌ల్లే విద్యార్థులు బ‌హ్య‌ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నార‌ని… ఈ విష‌యం తెలిసినాస‌రే కేవ‌లం మంత్రినారాయ‌ణ‌ను కాపాడేందుకు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నింద‌ను పిల్ల‌లు, వారి త‌ల్లిదండ్రుల మీద నెట్టేస్తోంద‌ని మండిప‌డుతున్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES