సినిమా హిట్…. నిర్మాతకు నష్టాలు

359

గరుడవేగ సక్సెస్ ఫుల్ గా మూడో వారంలోకి ఎంటరైంది. కాకపోతే వసూళ్లు మాత్రం పూర్తిగా పడిపోయాయి. పేరుకు హిట్ సినిమానే కానీ వసూళ్లులో మాత్రం ఆ ప్రభావం కనిపించలేదు. అంతా సినిమా హిట్ అంటున్నారు. కానీ ఓవరాల్ గా లెక్కలు తీస్తే ఇంకా నష్టాలే మిగిలాయి. దాదాపు 25 కోట్లు పెట్టి తీసిన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 2 వారాల్లో కేవలం అటు ఇటుగా 5.30కోట్లు మాత్రమే వచ్చాయి. మూడో వారంలో ఈ సినిమాకు భారీ వసూళ్లు ఆశించడం భ్రమే అవుతుంది. అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా చతికిలపడింది. ఈ నేపథ్యంలో…. శాటిలైట్ రైట్స్ పైనే నిర్మాత లాభాలు ఆధారపడి ఉన్నాయి.

ఏపీ, నైజాం 2 వారాల షేర్

నైజాం – రూ. 2.20 కోట్లు
సీడెడ్ – రూ. 0.70 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.05 కోట్లు
గుంటూరు – రూ. 0.42 కోట్లు
ఈస్ట్ – రూ. 0.40 కోట్లు
కృష్ణా – 0.14 కోట్లు
వెస్ట్ – 0.25 కోట్లు
నెల్లూరు – 0.18 కోట్లు

2 వారాల మొత్తం షేర్ – రూ. 5.34 కోట్లు

NEWS UPDATES

CINEMA UPDATES