ఆస్కార్ ఉత్త‌మ న‌టుడు గ్యారీ ఓల్డ్ మ‌న్‌

824

యుద్ధ నేప‌థ్యంలో తెర‌కెక్కిన బ్రిటీష్ చిత్రం డార్కెస్ట్ అవ‌ర్ 90 అకాడ‌మీ అవార్డుల్లో ప్ర‌భంజ‌నం సృష్టించింది. ఈ చిత్రంలో న‌టించిన గ్యారీ ఓల్డ్ మ‌న్ ఆస్కార్ ఉత్త‌మ న‌టుడిగా ఎంపిక‌య్యాడు. త్రీ బిల్ బోర్డ్స్ ఔట్ సైడ్ ఎబ్బింగ్ మిసోరీ లో అద్భుతంగా నటించిన ఫ్రాన్సెస్ మెక్ డోర్మండ్ కు ఉత్తమ నటి అవార్డు లభించింది. ఆమె కెరీర‌లో ఇది రెండో అవార్డు. ది షేప్ ఆఫ్ వాటర్ కు ఆస్కార్ బెస్ట్‌ఫిల్మ్ అవార్డు లభించింది. ఈసినిమా డైరక్టర్ గిల్లెర్మో డెల్ టోరో కూడా ఉత్తమ డైరక్టర్ గా ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్నారు.

సామ్ రాక్ వెల్ కు త్రీ బిల్ బోర్డ్స్ ఔట్ సైడ్ ఎబ్బింగ్ మిస్సౌరీ గాను ఉత్తమ సహాయ నటుడిగా అలీసన్ జానికి టోన్య చిత్రానికి ఉత్తమ సహాయనటిగా అవార్డులందుకునారు.

అమెరికా లాస్ ఏంజెల్స్లోని డాల్బీ థియేటర్లో 90వ ఆస్కార్ అవార్డుల వేడుక కన్నుల పండువగా జ‌రిగింది. భారత కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం 6.30 గంటలకు ఈ వేడుక ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో దివంగత బాలీవుడ్ నటులు శశికపూర్, శ్రీదేవికి ఘనంగా నివాళ్ళు అర్పించారు.

 

 

 

NEWS UPDATES

CINEMA UPDATES