ఈసారి కొత్త దర్శకుడితో….

190

ఎన్ని సినిమాలు చేస్తున్నా ఏదో ఒక ప్రాబ్లమ్. కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. మరికొన్ని మూవీస్ అసలు విడుదలకు కూడా నోచుకోవడం లేదు. ఇలాంటి టైమ్ లో ఓ కొత్త కుర్రాడికి దర్శకుడిగా ఛాన్స్ ఇవ్వడమంటే అది కాస్త రిస్క్ తో కూడుకున్న వ్యవహారమే. అలాంటి రిస్క్ నే చేస్తున్నాడు హీరో గోపీచంద్.

కె.చక్రవర్తి అనే అసిస్టెంట్ డైరక్టర్ కు దర్శకుడి హోదా కల్పిస్తూ ఓ సినిమా లాంచ్ చేశాడు గోపీచంద్. రామానాయుడు స్టుడియోస్ లో ఈరోజు పొద్దున్న ఈ సినిమా ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ నిర్మించనున్న ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్ గా ఎంపికైంది. గోపీసుందర్ మ్యూజిక్ అందిస్తాడు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్.

ప్రస్తుతం గోపీచంద్ నటించిన ఆక్సిజన్ సినిమా విడుదలకు అష్టకష్టాలు పడుతోంది. ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదాపడింది. మరోవైపు ఈ హీరో నటించిన ఆరడుగుల బుల్లెట్ సినిమా ఫస్ట్ కాపీ కూడా రెడీ అయి, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయింది. తాజాగా లాంచ్ చేసిన సినిమాపై మాత్రం బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు గోపీచంద్. ఇతడికి ఇది 25వ సినిమా కావడం విశేషం.

NEWS UPDATES

CINEMA UPDATES