సారిడాన్‌పై నిషేధం….

1456

తలనొప్పి అనగానే చాలా మంది సారిడాన్‌ను వాడుతుంటారు. ఈ మందుకు ప్రచారం కూడా బాగా చేశారు. అయితే ఈ సారిడాన్ వాడడం వల్ల జరిగే లాభం కంటే…. వచ్చే నష్టమే అధికమని తేలింది. దీంతో సారిడాన్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.

సారిడాన్‌తో పాటు 328 రకాల ఫిక్స్‌డ్‌ డోస్ కాంబినేషన్ (ఎఫ్‌డీసీ) డ్రగ్స్‌ను బ్యాన్‌ చేసింది. సారిడాన్‌తో పాటు చర్మ వ్యాధులకు వాడే పాన్ డెర్మ్, ఆల్కెం ల్యాబోరేటరీస్‌కు చెందిన టాక్సిమ్‌ ఏజెడ్‌, మెక్లోడ్స్‌ ఫార్మా పండెమ్‌ ప్లస్‌ క్రీమ్‌లను కూడా ప్రభుత్వం నిషేధించింది.

తక్షణం వీటి తయారీ, అమ్మకంపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర ప్రకటించింది. ప్రస్తుతం సారిడాన్ తో పాటు నిషేధానికి గురైన మందుల మార్కెట్‌ విలువ 2వేల 500 కోట్ల వరకు ఉంది.

డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్ 1940 చట్టంలోని సెక్షన్ 26A ప్రకారం 2016లో మార్చి 10న కేంద్ర ప్రభుత్వం 349 ఎఫ్‌డీసీలపై నిషేధం విధించగా… కంపెనీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దాంతో డ్రగ్స్‌ను పరిశీలించి నివేదిక ఇవ్వాలని డ్రగ్స్ టెక్నికల్ అడ్వయిజరీ బోర్డ్ (డీట్యాబ్)ను సుప్రీంకోర్టు కోరింది.

పరిశీలన జరిపిన కమిటీ…. 328 ఎఫ్‌డీసీ ఔషధాలు హానికరమని వాటిపై నిషేధించడం విధించడం సరైన చర్యే అని సుప్రీంకు నివేదిక ఇచ్చింది. దీంతో కేంద్రం తాజాగా వాటిని బ్యాన్‌ చేస్తూ ఆదేశాలు జారీచేసింది.

NEWS UPDATES

CINEMA UPDATES