✓ ఒపీనియన్‌ పోల్‌…. వెనకబడ్డ బీజేపీ

1328

గుజ‌రాత్‌లో ఎన్నిక‌లు స‌మీపిస్తున్నాయి. మ‌రో నాలుగు రోజుల్లో తొలి విడ‌త ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో చేప‌ట్టిన ఓ ఒపీనియ‌న్ పోల్‌ లో అనేక ఆస‌క్తి క‌ర విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. గుజ‌రాత్‌లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్న‌ట్లు ఆ ఒపీనియ‌న్ పోల్ స్ప‌ష్టం చేసింది. కాంగ్రెస్ వైపు ప్ర‌జలు మొగ్గుచూపుతున్న‌ట్లు తెలిసింది. కాంగ్రెస్ కు ఈ సారి జ‌రిగే ఎన్నిక‌ల్లో దాదాపు 78 నుంచి 86 సీట్లు ఖాయంగా వ‌స్తాయ‌ని ఒపీనియ‌న్ పోల్ తెలిపింది.

లోక్‌నీతి సంస్థ‌, ఏబీపీ న్యూస్ ఛానెల్ నిర్వ‌హించిన ఒపీనియ‌న్ పోల్‌లో అనేక విష‌యాలు స్ప‌ష్ట‌మ‌య్యాయి. గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో రెండు ప్ర‌ధాన పార్టీల‌కు స‌రిస‌మానంగా ఓట్ల షేర్ ఉండ‌నుంద‌ని తెలిపింది. కాంగ్రెస్‌కు, బిజెపిల‌కు 43 శాతం ఓట్లు ద‌క్కే అవ‌కాశాలున్న‌ట్లు తెలిపింది. 2012లో 115 సీట్లు సాధించిన బిజెపి ఈ సారి 150 సీట్లు ఖాయంగా గెలుస్తుంద‌ని అమిత్ షా చెప్పారు. ప్ర‌స్తుతం ఆ ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. బిజెపికి కేవ‌లం 91 నుంచి 99 సీట్లు మాత్ర‌మే వ‌స్తాయ‌ని ఒపీనియ‌న్ పోల్ స్ప‌ష్టం చేసింది.

పెద్ద‌నోట్ల ర‌ద్దు, జీఎస్టీ లు ప్ర‌జ‌ల‌కు అనేక ఇబ్బందులు క‌లిగించాయ‌ని, గ‌త నెలలో జీఎస్టీకి చేసిన మార్పులు కూడా ప్ర‌జ‌ల‌ను సంతోష ప‌ర‌చ‌లేదు. వారు బిజెపి ప్ర‌భుత్వంపై చాలా కోపంగా ఉన్న‌ట్లు తెలిసింది. బిజెపి ప్ర‌భుత్వంపై రైతుల ఆగ్ర‌హం…. కాంగ్రెస్‌కు అవ‌కాశంగా మారింది.

ఉత్త‌ర గుజ‌రాత్‌, ద‌క్షిణ గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ప‌ట్టు పెరిగింద‌ని, బిజెపికి సౌరాష్ట్ర‌, మ‌ధ్య గుజ‌రాత్ ప్రాంతాల్లో ఆధిప‌త్యం కొన‌సాగుతోంద‌ని ఒపీనియ‌న్ పోల్ పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు ప‌ట్టుంటే, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో బిజెపికి ప‌ట్టు క‌నిపిస్తోంద‌ని ఆ ఒపీనియ‌ల్ పోల్ తెలిపింది.

18 నుంచి 29 వ‌య‌సు గ‌ల వారు బిజెపికి మ‌ద్ద‌తు తెలుపుతుండ‌గా, 30 ఏళ్లు దాటిన వారంతా కాంగ్రెస్ వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్న‌ట్లు ఒపీనియ‌న్ పోల్ తెలిసింది. రాష్ట్రంలో అచ్చే దిన్ రాలేద‌ని చాలా మంది ప్ర‌జ‌లు బ‌లంగా న‌మ్ముతున్నారు. 2014లో జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బిజెపికి ఓటేసిన వారంతా ఈ అభిప్రాయం వ్య‌క్తం చేయ‌డం విశేషం.

ఇదిలా ఉంటే గుజ‌రాత్‌లో ప్ర‌చారం ఉధృతంగా సాగుతోంది. మాట‌ల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇరుపార్టీలు ఒక‌రిపై ఒక‌రు ఘాటైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు. రాహుల్‌గాంధీ ఒక వైపు బ‌హిరంగ స‌భ‌ల్లో బిజెపిని నిల‌దీస్తూనే ట్విట్ట‌ర్లో కూడా ప‌దునైన విమ‌ర్శ‌ల‌తో మోడీపై దాడి చేస్తున్నారు. రోజుకో ప్ర‌శ్న వేస్తూ మోడీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. అదే విధంగా కాంగ్రెస్ సీనియ‌ర్ నేత చిదంబ‌రం కూడా అనేక విష‌యాల‌ను ట్విట్ట‌ర్లో ప్ర‌స్తావిస్తూ బిజెపిని నిల‌దీస్తున్నారు. గుజ‌రాత్ అభివృద్ధి న‌మూనాను ప్ర‌శ్నించారు. అలాగే కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధి ర‌ణ‌దీప్‌సుర్జేవాలా కూడా బిజెపి లోపాల‌ను ఎత్తిచూపుతున్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES