గుజ‌రాత్‌లో కాంగ్రెస్ కి క‌లిసి వ‌స్తున్న స‌రికొత్త వ్యూహాలు

680
gujarat polls congress political strategies rahul gandhi narendra modi

గుజ‌రాత్‌లో కాంగ్రెస్ అనుస‌రిస్తున్న స‌రికొత్త వ్యూహాలు ఆ పార్టీకి బలాన్ని చేకూరుస్తున్నాయి. గెలుపుపై ఆశ‌లు చిగురింప చేస్తున్నాయి . పార్టీ క్యాడ‌ర్‌కు మ‌రింత ఉత్సాహాన్ని క‌లిగిస్తున్నాయి. పార్టీని.. ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ చేస్తున్నాయి. రాహుల్‌గాంధీ అంతా తానై చేస్తున్నప్ర‌చారం… గుజ‌రాత్ ప్ర‌జ‌ల‌పై ప్ర‌భావం చూపుతోంది. ప‌దునైన విమ‌ర్శ‌ల‌తో రాహుల్ చేస్తున్న ప్ర‌సంగాలు… ప్ర‌జ‌ల‌ను కాంగ్రెస్ వైపు తిరిగి చూసేలా చేస్తున్నాయి. ఇటీవ‌ల కాలంలో వెలువ‌డుతున్న వివిధ స‌ర్వేలు ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి.

కాంగ్రెస్ హిందూ వ్య‌తిరేకి అనే భావ‌న‌ను ప్ర‌జ‌ల‌లో క‌ల‌గ‌కుండా రాహుల్ జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. వివిధ ఆల‌యాల‌ను సంద‌ర్శించి ఆయ‌న త‌న భ‌క్తిని చాటుకున్నారు. హిందువుల‌లో త‌మ ప‌ట్ల అభిమానాన్ని పెంచుకోగ‌లిగారు. అదే విధంగా కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు చేస్తున్న డోర్ టుడోర్ క్యాంపైన్ కు మంచి స్పంద‌న ల‌భిస్తోంది. కాంగ్రెస్‌కు ప్ర‌జ‌ల‌లో ఆద‌ర‌ణ పెరుగుతోంది. గుజ‌రాత్ పార్టీ ఇన్‌చార్జ్ అశోక్ గెహ్లాట్ చేస్తున్న‌ప్లానింగ్ కూడా కాంగ్రెస్ పార్టీకి క‌లిసివ‌స్తోంది.

రాహుల్ గాంధీ గుజ‌రాత్‌లో చేపడుతున్న‌స‌మావేశాల‌లోను, ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌ధానిపై సూటిగా చేస్తున్న విమ‌ర్శ‌లు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. ప్ర‌ధాని మోడీ కూడా రాహుల్ చేస్తున్న విమ‌ర్శ‌ల‌లో కొన్నింటికి స్పందిస్తున్నారు. ఆ విధంగా రాహుల్ గాంధీ ఒక విధంగా స‌ఫలీకృతుడైన‌ట్లే. కాంగ్రెస్ కు ఇటీవ‌ల కాలంలో గిరిజ‌నులు, వ్యాపారులు, ప‌టీదార్లు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డం ఆ పార్టీకి క‌లిసివ‌చ్చే అంశం.

కాంగ్రెస్ వ్యూహ‌క‌ర్త‌లు న‌రేంద్ర మోడీ చేస్తున్న ప్ర‌తి విమ‌ర్శ‌కు స‌రిగ్గా కౌంట‌ర్ ఇస్తున్నారు. అదే విధంగా హార్ధిక్ ప‌టేల్‌ను కూడా కాంగ్రెస్ స‌రైన స‌మ‌యంలో త‌మ‌వైపు తిప్పుకుని ప్ర‌ధాన అస్త్రంగా మ‌లుచుకుంది. ప్ర‌ధానిపై ప‌దునైన విమ‌ర్శ‌లు చేయ‌డంలో సిద్ధ‌హ‌స్తుడైన హార్ధిక్ ప‌టేల్ ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల స‌మ‌ర్ధుడు.

కాంగ్రెస్ మోడీ పాల‌న‌ను, విధానాల‌ను విమ‌ర్శిస్తుంటే …హార్ధిక్ ప‌టేల్ త‌న‌దైన శైలిలో మోడీపై ప్రత్య‌క్షంగా విరుచుకుప‌డుతున్నాడు. గుజ‌రాత్ అభివృద్ధి న‌మూనాలోని డొల్ల‌త‌నాన్ని ప‌దే ప‌దే ప్ర‌శ్నిస్తున్నారు. మోడీ చెప్పిన ప్ర‌తి విష‌యాన్ని న‌మ్మ‌వ‌ద్ద‌ని గుజ‌రాత్ ప్ర‌జ‌ల‌కు హార్ధిక్ ప‌టేల్ విజ్ఞ‌ప్తి చేస్తున్నాడు. అలాగే జిగ్నేష్‌ మేవాని, అల్పేష్‌ ఠాకూర్‌ బీజేపీకి పగలే చుక్కలు చూపిస్తున్నారు.

ప్ర‌జ‌ల‌లో బిజెపిపై ఉన్న కోపాన్ని త‌మ‌కు అనుకూలంగా మ‌ల‌చుకునేందుకు కాంగ్రెస్ వ్యూహ‌క‌ర్త‌లు తీవ్రంగా కృషి చేస్తున్నారు. చివ‌రి క్ష‌ణాల్లో బిజెపి అనుస‌రించే ఎత్తుగ‌డ‌ల‌ను స‌రిగ్గా తిప్ప‌కొట్ట‌గ‌లిగే స‌మ‌ర్ధ‌త‌ను కాంగ్రెస్ పెంచుకోగ‌లిగితే… గుజ‌రాత్ రాష్ట్రంలో ప్ర‌భుత్వ ఏర్పాటు అసాధ్య‌మైన విష‌య‌మేమీ కాద‌ని తెలుస్తోంది.

కాంగ్రెస్ త‌మ‌కున్న బ‌ల‌గాల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా, స‌మిష్టిగా వినియోగించుకోవ‌డంపై ఆ పార్టీ విజ‌యావ‌కాశాలు ఆధార‌ప‌డి ఉన్నాయి.

NEWS UPDATES

CINEMA UPDATES