బిజెపి డ‌ర్టీ పాలిటిక్స్‌

418

ప‌టేల్‌ ఉద్య‌మ నాయ‌కుడు హార్ధిక్ ప‌టేల్‌ను బిజెపి మ‌రోసారి టార్గెట్ చేసింది. రెండు రోజులు క్రితం ఒక సెక్స్ వీడియోను విడుద‌ల చేసిన బిజెపి నేత‌లు అక్టోబ‌ర్ 14న మ‌రో సిడిని విడుద‌ల చేశారు. ఈ వీడియోలో హార్ధిక్‌ను పోలిన‌ట్లు వున్న వ్య‌క్తి ఒక మంచంపై ఉన్నాడు. ఆ వ్య‌క్తితో పాటు మ‌రో ఇద్ద‌రు పురుషులు ఒక స్త్రీ కూడా మంచంపై ఉన్నారు. సీక్రెట్‌గా రికార్డ‌యిన‌ ఈ వీడియో ఈ ఏడాది మే లో చిత్రీక‌రించిన‌ట్లు తెలుస్తోంది.

ఈ వీడియోపై హార్ధిక్ ప‌టేల్ ఇంకా స్పందించ‌లేదు. మొద‌టి సిడి విడుద‌ల అయిన వెంట‌నే స్పందించిన హార్ధిక్ ప‌టేల్ బిజెపి కుళ్లు రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతుంద‌ని నిందించాడు. ఇది ఆరంభం మాత్ర‌మే న‌ని ఇటువంటి సిడిలు ఇంకా చాలా వ‌ర‌కు బిజెపి విడుద‌ల చేయబోతుందని తెలిపాడు. బిజెపి చేస్తున్న నీచ రాజ‌కీయాల‌ను తాను ఎదుర్కొంటాన‌ని హార్ధిక్ ప‌టేల్ స్ప‌ష్టం చేశాడు.

రాజ‌కీయ ల‌బ్ధి కోసం మ‌హిళ‌ల‌ను అడ్డుపెట్టుకుని త‌న‌ని ఇరుకున పెట్టాల‌ని చూస్తున్నార‌ని….ఇలా చేయ‌డం ద్వారా మ‌హిళ‌ల‌ను అవ‌మాన ప‌రుస్తున్నార‌ని హార్ధిక్ ప‌టేల్ ఘాటుగా స్పందించాడు.

త‌నపై బుర‌ద జల్లేందుకు న‌కిలీ సిడిలు త‌యారు చేస్తూ బిజెపికి స‌హ‌కరిస్తున్న వ్య‌క్తి ఇటీవ‌లే ఢిల్లీ వెళ్లి ఆ పార్టీలో చేరాడ‌ని హార్ధిక్ పటేల్ మీడియాకు తెలిపాడు. బిజెపి ఆడుతున్న సిడి డ్రామా గురించి త‌న‌కు ముందే తెలుసున‌ని హార్దిక్ పటేల్ చాలా రోజుల క్రితమే ఊహించాడు.

బిజెపి త‌న ఇమేజ్‌ను దెబ్బ‌తీసేంద‌కు కోట్ల రూపాయ‌ల‌ను కుమ్మ‌రిస్తోంద‌ని హార్ధిక్ పటేల్ అన్నాడు. తాను ఎటువంటి ఆందోళ‌న చెంద‌డం లేద‌ని వాటిని ఎలా ఎదుర్కోవాలో త‌న‌కు తెలుసున‌ని ధీమా వ్య‌క్తం చేశాడు.

హార్దిక్ ప‌టేల్ చేస్తున్న వ్యాఖ్య‌ల‌ను బిజెపి ఖండించింది. సెక్స్ సిడిల విడుద‌ల‌తో త‌మ‌కు ప్ర‌మేయం లేద‌ని స్ప‌ష్టం చేసింది.

NEWS UPDATES

CINEMA UPDATES