రాష్ట్రపతి అవార్డు అందుకున్న సీబీఎస్ఈ టాపర్ పై సామూహిక అత్యాచారం

1412

దేశవ్యాప్తంగా నిర్వహించే ‘సీబీఎస్ఈ’ పరీక్షల్లో టాపర్ ఆ అమ్మాయి. ఏకంగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డ్ కూడా అందుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రశసించారు. ఇంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్న అమ్మాయికి కూడా దేశంలో రక్షణ లేదని మరోసారి నిరూపితమైంది. దుండగుల చేతిలో సామూహిక అత్యాచారానికి గురైన ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్ల గడప తొక్కినా న్యాయం ఎండమావే అయ్యింది. నిందితుల బెదిరింపులకు పోలీసులు ఆ అమ్మాయి ఫిర్యాదును తీసుకోకపోవడం నివ్వెరపరిచింది. ఈ దారుణ అమానవీయ ఘటన హర్యాన రాష్ట్రంలో చోటుచేసుకుంది.

హర్యానా రాష్ట్రంలో అమ్మాయిల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది. అక్కడి యువతకు పెళ్లి కాకపోవడంతో దక్షిణాది నుంచి రాజస్థాన్ నుంచి అమ్మాయిలను కొనుక్కొని వచ్చి చేసుకుంటున్నారు. ఇదే సమయంలో మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లుతున్నాయి. ఎంతలా అంటే నడిబజారులో నడుస్తున్నా కూడా అమ్మాయిలను కిడ్నాప్ చేసి రేప్ చేసేంత.

హర్యానాలోని రేవారి గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి ప్రస్తుతం డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. ఈమె గతంలో సీబీఎస్ఈ టాపర్ గా రాష్ట్రపతి నుంచి అవార్డ్ పొందింది. బుధవారం ఊరికి సమీపంలోని కోచింగ్ సెంటర్ నుంచి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు కారులో వచ్చిన ముగ్గురు యువకులు బాలికను కిడ్నాప్ చేశారు.

అనంతరం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అక్కడే ఉన్న మరికొందరు యువకులు కూడా ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు. ఆ తర్వాత నిందితులు సృహ కోల్పోయిన బాధితురాలిని బస్టాండ్ సమీపంలో వదిలేసి పారిపోయారు. సృహలోకి వచ్చాక యువతి తనకు జరిగిన అన్యాయంపై తల్లిదండ్రుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది.

అయితే స్థానిక పోలీసులు తొలుత వారి ఫిర్యాదు ను స్వీకరించలేదు. నిందితులు పోలీసులను బెదిరించారని…. తాము కేసు నమోదు చేయలేదని…. పోలీసులు తప్పించుకు తిరిగారని యువతి తండ్రి మీడియా ఎదుట వాపోయారు. దీంతో పోలీస్ ఉన్నతాధికారి వద్దకు వెళ్లగా అప్పటికప్పుడు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మీడియాలో ఫోకస్ కావడంతో శుక్రవారం సంబంధిత పోలీస్ స్టేషన్ కు కేసు బదిలీ చేశామని పోలీస్ ఉన్నతాధికారులు ప్రకటించారు.

NEWS UPDATES

CINEMA UPDATES