తాజ్ మ‌హ‌ల్ ఓ అంద‌మైన స్మ‌శానం

513

ప్ర‌పంచంలోని ఏడు వింత‌ల్లో ఒక‌టిగా ప‌రిగ‌ణించే పాల‌రాతి క‌ట్ట‌డం తాజ్‌మ‌హ‌ల్‌ను బిజెపి నాయ‌కులు ఇంకా కించ‌పరుస్తూనే ఉన్నారు. ఒక‌రి త‌ర్వాత ఒక‌రు నోరు పారేసుకుంటున్నారు. తాజాగా ఆ జాబితాలో హ‌ర్యానా మంత్రి చేరారు.

హ‌ర్యానా ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న అనిల్ విజ్ అనే నాయ‌కుడు తాజ్‌మ‌హ‌ల్‌ను ఒక అంద‌మైన స్మ‌శానం అంటూ ట్వీట్ చేశారు. తాజ్‌మ‌హ‌ల్ ఏక్ ఖూబ్ సూర‌త్ ఖ‌బ‌ర‌స్తాన్ హై అని ట్విట్ట‌ర్లో పోస్ట్ చేశారు.

హ‌ర్యానా ప్ర‌భుత్వంలో క్రీడా, ఆరోగ్య శాఖ మంత్రి గా ఉన్న అనిల్ విజ్ వివాదాస్ప‌ద‌ వ్యాఖ్య‌లు చేయ‌డంలో దిట్ట‌. గ‌తంలోనూ అనేక వివాదాస్ప‌ద కామెంట్లు చేసి పార్టీకి త‌ల‌నొప్పి తెచ్చారు. తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఎటువంటి ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తాయో చూడాలి.

ఇప్ప‌టికే ఉత్త‌ర ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ్యుడు సంగీత్ సోమ్ తాజ్‌మ‌హ‌ల్ గురించి చేసిన వ్యాఖ్య‌లు దేశ వ్యాప్తంగా దుమారం రేపాయి. తాజ్‌మ‌హ‌ల్ దేశ సంస్కృతికి మాయ‌ని మ‌చ్చ అని ఆయ‌న చేసిన కామెంట్ బిజెపిని ఇర‌కాటంలో ప‌డేసింది.

సోమ్ చేసిన వ్యాఖ్య‌ల వ‌ల్ల క‌లిగిన న‌ష్టాన్నిపూరించేందుకు యూపీ సీఎం ఏకంగా తాజ్‌మ‌హ‌ల్‌ను ప్ర‌త్య‌క్షంగా సంద‌ర్శించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అక్టోబ‌ర్ 26న తాజ్‌ను సంద‌ర్శించి త‌మ‌పై వ‌చ్చిన అప‌ప్ర‌ద‌ను తొల‌గించుకోవాల‌ని భావిస్తున్నారు.

ఒక‌వైపు సీనియ‌ర్ నేత‌లు దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌డుతుంటే మ‌రోవైపు నుంచి ఎవ‌రో ఒక‌రు మాట తూలుతున్నారు. పార్టీ ప‌రువును బ‌జారుకు ఈడుస్తున్నారు. వారిని క‌ట్ట‌డి చేయ‌డం అగ్ర నేత‌ల‌కు సాధ్యం కావ‌డం లేదు. ఈ వ్యాఖ్య‌లు ప‌రిణామాలు ఏవిధంగా ఉంటాయో రానున్న రోజుల్లో తేల‌నుంది.

NEWS UPDATES

CINEMA UPDATES