నాని, అఖిల్ మధ్యలో అల్లువారబ్బాయ్

213

డిసెంబర్ లో నాని, అఖిల్ మధ్య బాక్సాఫీస్ వార్ తప్పదని అంతా ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. ఈ నేపథ్యంలో నాని నటిస్తున్న ”ఎంసీఏ” సినిమాను వారం ముందే విడుదల చేసే అవకాశాలున్నాయంటూ పుకార్లు కూడా వస్తున్నాయి. మొత్తమ్మీద వారం రోజుల గ్యాప్ లో అయినా పోటీ తప్పదని అంతా భావిస్తున్నారు. ఇలాంటి టైమ్ లో వీళ్లిద్దరి మధ్యలో పోటీకి మరో హీరో దిగాడు. అతడే మెగా హీరో అల్లు శిరీష్.

అఖిల్ నటిస్తున్న ”హలో” సినిమాను డిసెంబర్ 22న విడుదల చేయబోతున్నారు. నాని సినిమా అంతకంటే వారం ముందు విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ రెండు సినిమాలకు పోటీగా అల్లు శిరీస్ కూడా తన కొత్త సినిమా ”ఒక్క క్షణం” ను సిద్ధం చేశాడు. ఈ మూవీని డిసెంబర్ 23న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు అల్లు శిరీష్.

వీఐ ఆనంద్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది ”ఒక్కక్షణం” సినిమా. మూవీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది.

NEWS UPDATES

CINEMA UPDATES