నాగార్జున వాయిస్ ఓవర్ తో “హలో” టీజర్

470

అక్కినేని అఖిల్ తన రెండో మూవీ గా చేస్తున్న మూవీ “హలో”. తన మొదటి మూవీ అయిన “అఖిల్” బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా ఆడకపోవడం తో ఈ సినిమా పై ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నాడు అఖిల్. “మనం”, “24” మూవీస్ ఫేం అయిన విక్రం కె కుమార్ ఈ మూవీ ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ అందరిలోనూ ఈ మూవీ పై అంచనాలని పెంచుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీ యొక్క టీజర్ ని త్వరలో రిలీజ్ చేయడానికి మూవీ యూనిట్ ప్లాన్ చేసారు. అయితే ఈ మూవీ టీజర్ కి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈ మూవీ టీజర్ కి అక్కినేని నాగార్జున వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడట. టీజర్ లో మూవీ కంటెంట్ నాగార్జున చేత చెప్పిస్తే బాగుంటుంది అని మూవీ యూనిట్ భావించారు అని తెలుస్తుంది. ఇకపోతే అక్కినేని నాగార్జునే ఈ మూవీ ని అన్నపూర్ణ బ్యానర్ పై ప్రొడ్యూస్ చేస్తున్నాడు. డిసెంబర్ 22న రిలీజ్ కానున్న ఈ మూవీ లో దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఈ మూవీతో అయినా అక్కినేని కుర్రాడు గట్టిగా హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి.

 

NEWS UPDATES

CINEMA UPDATES