20 న మళ్ళీ సందడి చేయబోతున్న అఖిల్

213

అక్కినేని అఖిల్ ఇంకా విక్రం కె కుమార్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ “హలో”. రీసెంట్ గా రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్ ఇంకా ట్రైలర్స్ ఈ మూవీ పై అంచనాల్ని పెంచేసాయి. మూవీ లో ఏదో ఒక కొత్త ఎలిమెంట్ ఉంది అని ఈ ట్రైలర్స్ చెప్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీ యొక్క ఆడియో లాంచ్ రీసెంట్ గా వైజాగ్ లో జరిగింది. ఇక ఈనెల 20న హైదరాబాద్ లో అఖిల్ “హలో” ప్రీరిలీజ్ ఈవెంట్ ని చేయాలనీ అనుకుంటున్నాడు. అయితే ప్రస్తుతం అఖిల్ అమెరికా టూర్ లో ఉన్నాడు. 19కి అఖిల్ ఇక్కడికి వచ్చేస్తే 20న ప్రీరిలీజ్ వేడుక గ్రాండ్ గా చేయాలనీ ప్లాన్.

అక్కినేని ఫ్యామిలీ మొత్తం, అలాగే నాగార్జున సన్నిహితులు, ఇంకా పలువురు సెలబ్రిటీలను ఆహ్వానించే ప్లాన్స్ మూవీ యూనిట్ కి ఉన్నాయి. నాగార్జున కూడా ఈ మూవీ తో అఖిల్ కి హిట్ అందించాలి అని గట్టిగా కృషి చేస్తున్నాడు. నాగార్జున ఎంత కష్టపడ్డ గాని ఆపైన విక్రమ్ కె కుమార్ అందించే కథ మీద మూవీ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. మరి “అఖిల్” మూవీ తో భారీ ఫ్లాప్ ని అందుకున్న అఖిల్, “హలో” మూవీ తో ఏ రేంజ్ హిట్ ని అందుకుంటాడో చూడాలి.

NEWS UPDATES

CINEMA UPDATES