నవంబర్ 16న “హలో” టిసర్

286

అక్కినేని అఖిల్ తన మొదటి సినిమా అయిన “అఖిల్” మూవీ ఫ్లాప్ అయ్యక రెండో సినిమా పై ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నాడు. అక్కినేని అఖిల్ రెండవ సినిమా అయిన “హలో” ప్రస్తుతం షూటింగ్ ఎండింగ్ స్టేజి లో ఉంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ పై అక్కినేని నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నాడు.

అయితే ట్విట్టర్ ద్వారా అఖిల్ ఈ మూవీ యొక్క టిజర్ రిలీజ్ డేట్ ని ప్రకటించాడు. నవంబర్ 16 న “హలో” మూవీ యొక్క టిజర్ రిలీజ్ కానుంది. ఈ న్యూస్ తో పాటే ఈ మూవీ కి సంబంధించిన ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేసాడు అఖిల్. ఈ పోస్టర్ కూడా ఫస్ట్ లుక్‌ లానే వెరైటీగా ఉంది. ఇందులో కూడా అఖిల్ యాక్షన్ స్టంట్స్ చేస్తూ కనబడుతున్నాడు. ఈ మూవీ ని డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మూవీ టీం. సీనియర్ మలయాళ దర్శకుడు అయిన ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి ఈ మూవీ తో తొలి సారిగా హీరోయిన్ గా పరిచయం అవుతుంది. ఈ మూవీ కి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి ఫస్ట్ లుక్ తోనే మూవీ లో ఏదో మ్యాటర్ ఉంది అని తెలిసేలా చేసిన విక్రం కె కుమార్ టిజర్ ని ఎలా కట్ చేసాడో అని అందరు వెయిట్ చేస్తున్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES