మణిరత్నం పై సంచలన వ్యాఖ్యలు చేసిన కార్తి

640

హీరో కార్తీ ఇంకా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన మూవీ “చెలియా”. మణిరత్నం దర్శకత్వం లో నటించాలి అని ప్రతి హీరో అనుకుంటాడు. అలాగే కార్తి కూడా మణిరత్నం మూవీ లో ఛాన్స్ రాగానే ఎగిరి గంతేసాడు. కాని “చెలియా” సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయం పొందింది.

అయితే ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని కథ విన్నప్పుడే నాకు తెలుసనీ సంచలన వ్యాఖ్యలు చేసాడు కార్తి . సినిమా ఫ్లాప్ అవుతుందని కథ విన్నప్పుడే తెలిసినప్పటికీ కేవలం మణిరత్నం దర్శకుడు అనే ఒకే ఒక్క కారణం చేత ఆ మూవీలో నటించడానికి ఒప్పుకున్నాను అని చెప్పుకొచ్చాడు కార్తి. పైగా మణిరత్నం దర్శకత్వంలో నటించడం అంటే నటనలో మరిన్ని మెలుకువలు నేర్చుకోవచ్చు అందుకే కార్తీ “చెలియా” లో నటించాడట.

ఇక లేటెస్ట్ గా ఈ హీరో నటించిన మూవీ “ఖాకీ” ఈనెల 17 న రిలీజ్ కి సిద్దమైన క్రమం లో ఈ మూవీ యొక్క ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు కార్తి. రియలిస్టిక్ అప్రోచ్ తో తీసిన “ఖాకీ” సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అంటున్నాడు కార్తీ.

NEWS UPDATES

CINEMA UPDATES