కొత్త మూవీని స్టార్ట్ చేసిన అక్కినేని హీరో

332

అక్కినేని హీరో అయిన సుమంత్ ఈసారి రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్ని కాకుండా కథ, పాత్ర పరంగా కొత్తదనమున్న సినిమాను చేయాలనే ఉద్దేశ్యంతో కొన్ని కొత్త కథలని విని ఒక థ్రిల్లర్ ను ఓకే చేశాడు. ఈ స్క్రిప్ట్ లో సుమంత్ పాత్రకు కొంత నెగెటివ్ షేడ్స్ ఉండటమే గాక కథ కూడా చాలా ఆసక్తిగా, కొత్తగా ఉండనుంది అని తెలుస్తుంది. సహజత్వానికి దగ్గరగా ఉంటూ సరికొత్త బ్యాక్ డ్రాప్లో నడవనున్న ఈ మూవీ ని అనిల్ శ్రీకంఠం అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేయనున్నాడు.

అనిల్ గతంలో “ఊహలు గుస గుసలాడే” “పిల్ల జమిందార్” “సుకుమారుడు” “సావిత్రి” “జ్యో అచ్యుతానంద” వంటి సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాడు. ఈ మూవీ ఈరోజే ఫిలిం నగర్ లో లాంఛనంగా ప్రారంభమైంది. ఇప్పటి వరకు తెలుగులో రాని బ్యాక్ డ్రాప్లో రూపొందనున్న ఈ సినిమా తనకు మంచి విజయాన్ని అందిస్తుందని సుమంత్ ధీమాగా ఉన్నాడట. ఇకపోతే ఈ మూవీ ఎప్పుడు మొదలవుతుంది, హీరోయిన్ ఎవరు, ఇతర సాంకేతిక నిపుణులు ఎవరు అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే సుమంత్ తదుపరి మూవీ అయిన “మళ్ళి రావా” అనే మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ గా ఉంది.

NEWS UPDATES

CINEMA UPDATES