ప్రపంచ ట్రాక్ అండ్ ఫీల్డ్ లో అసోం మెరుపుతీగ

2641
  • ప్రపంచ ట్రాక్ అండ్ ఫీల్డ్ స్వర్ణంతో చరిత్ర సృష్టించిన హిమ దాస్
  • మహిళల 400 మీటర్ల పరుగులో అసోం ఎక్స్ ప్రెస్
  • ప్రపంచ జూనియర్ అండర్ -20 మహిళల 400 మీటర్ల పరుగులో స్వర్ణం

భారత యువఅథ్లెట్, అసోం ఎక్స్ ప్రెస్ హిమ దాస్ చరిత్ర సృష్టించింది. ప్రపంచ ట్రాక్ అండ్ ఫీల్డ్ మీట్ లో బంగారు పతకం సాధించిన భారత తొలి మహిళగా రికార్డుల్లో చోటు సంపాదించింది.

 ఫిన్లాండ్ లోని టాంపారే వేదికగా జరుగుతున్న  ప్రపంచ జూనియర్ అండర్ -20 ట్రాక్ అండ్ ఫీల్డ్ మీట్…మహిళల 400 మీటర్ల పరుగులో 18 ఏళ్ల హిమ దాస్ 51. 46 సెకన్ల రికార్డుతో విజేతగా నిలిచింది.

2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ మహిళల 400 మీటర్ల పరుగులో ఆరోస్థానం మాత్రమే సాధించిన హిమ దాస్…ప్రపంచ జూనియర్ మీట్ లో మాత్రం సత్తా చాటుకొంది.

2002 ప్రపంచ మీట్ మహిళల డిస్కస్ త్రోలో సీమా పూనియా, 2014 ప్రపంచ మీట్ లో నవ్ జీత్ కౌర్ ధిల్లాన్ కాంస్య పతకాలు మాత్రమే సాధించారు. అయితే…ఆ ఇద్దరి రికార్డులను హిమా దాస్…స్వర్ణపతకంతో తెరమరుగు చేసింది.

NEWS UPDATES

CINEMA UPDATES