హైపర్‌ v/s కత్తి…. ముదిరిన సెల‌బ్రెటీ ఫైటింగ్‌

533

జబర్దస్త్ కామెడీ షో టీమ్ లీడ‌ర్ హైప‌ర్ ఆది, సినీ విమ‌ర్శ‌కుడు క‌త్తి మ‌హేష్ మ‌ధ్య మాట‌ల యుద్ధం ముదిరింది. ఒక‌రిపై ఒక‌రు వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దిగారు. ఒక‌రేమో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని సైడ్ తీసుకుంటే…మ‌రొక‌రేమో యాంటీ సైడ్‌తో త‌న‌దైన శైలిలో మాట్లాడారు. చివ‌ర‌కు ఇది ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ గోల‌గా మారింది. కత్తి మహేష్‌కు పొట్ట ఉందని, బట్టతల ఉంది అని నేను అనుకోవడం లేదు. కత్తి మహేష్ క్యూట్ బాయ్. సుత్తి రాజేష్ అనేవాడు మా ఊరిలో ఉండే స్నేహితుడిని ఉద్దేశించి చేసింది. నా ఫ్రెండ్‌కు పెసరట్టు వేయడం కూడా రాదు. దోశలు వేయడం రాదు. కత్తి మహేష్ మాదిరిగానే నా ఫ్రెండ్ సుత్తి రాజేష్ మాట్లాడుతుంటాడు. పవన్ కల్యాణ్‌ను వాడు కూడా విమర్శిస్తుంటాడని హైప‌ర్ ఆది విమ‌ర్శ‌లు చేశారు.

అయితే త‌న పొట్ట‌ ,బ‌ట్ట త‌ల గురించి కామెడీ చేసి చీప్ ట్రిక్స్‌ను ఎందుకు ప్ర‌యోగిస్తున్నావ‌ని క‌త్తి రివ‌ర్స్ ప్ర‌శ్న‌లు వేశారు. అయితే తాను ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్ కాబ‌ట్టి అలాగే మాట్లాడ‌తాన‌ని ఆది చెప్పాడు. ఇటు క‌త్తి మ‌హేష్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన ఫొటోపై కూడా హైప‌ర్ ఆది తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశాడు. నాతో ఫొటో దిగి మేమంత బాగానే ఉంటాం. ఫ్యాన్సే వెధవలు అని పోస్ట్ చేయడంపై ఆది మండిపడ్డాడు. నేను పవన్ కల్యాణ్ ఫ్యాన్‌ను. నీవు నన్ను ఉద్దేశించి వెధవ అని అంటావా? నాతో దిగిన ఫొటోను నీవు అలా వాడుకొంటావా అని నిలదీశాడు. అయితే అందులో త‌ప్పేంటి అని క‌త్తి ప్ర‌శ్నించాడు. మొత్తానికి వీరిద్ద‌రి మ‌ధ్య మాట‌ల యుద్దం ముందు ముందు ఎటు వెళ్తుందో చూడాలి.

NEWS UPDATES

CINEMA UPDATES