పార్టీ కండువా కప్పుకున్న ఐవైఆర్

1354

మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. బీజేపీలో చేరారు. హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన అమిత్ షా సమక్షంలో ఐవైఆర్… బీజేపీ కండువా కప్పుకున్నారు.

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో పాటు వెళ్లిన ఐవైఆర్‌…. నోవాటెల్‌ హోటల్‌లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఐవైఆర్‌కు పార్టీ కండువా కప్పిన అమిత్ షా…. పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.

చంద్రబాబు అమరావతి భూములకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్న సమయంలో ఐవైఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. రిటైర్ అయిన తర్వాత బ్రాహ్మణ కార్పొరేషన్‌ బాధ్యతలు చూశారు. కానీ చంద్రబాబు విధానాలను సోషల్ మీడియాలో విమర్శించారన్న కారణంతో ఏకపక్షంగా కార్పొరేషన్‌ నుంచి గెంటివేసింది చంద్రబాబు ప్రభుత్వం.

అప్పటి నుంచి చంద్రబాబుపై ఐవైఆర్‌ తన పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న అనేక చట్టవిరుద్ద పనులను ఆయన బయటపెడుతూ వచ్చారు. అమరావతి అక్రమాలపై ఒక పుస్తకాన్ని కూడా రాశారు.

NEWS UPDATES

CINEMA UPDATES