ఐకియా బిర్యానీలో గొంగ‌ళి పురుగు!

1460

ఐకియా…. ఓ ఫ‌ర్నీచ‌ర్ షోరూమ్‌. ఇంట‌ర్నేష‌న‌ల్ బ్రాండ్‌. ఫ‌ర్నీచ‌ర్ ఒక్క‌టే కాదు. ఐకియా రెస్టారెంట్లు కూడా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫేమ‌స్‌. ఇంకేముంది హైద‌రాబాద్ జ‌నాలు ఎగ‌బ‌డ్డారు. కొన‌డం త‌క్కువ‌. తిన‌డం మాత్రం ఎక్కువ. కొన్ని రోజులుగా హైద‌రాబాద్‌లో ఐకియా మేనియా న‌డుస్తోంది.

అయితే ఇప్పుడు ఐకియా వినియోగ‌దారుల‌ను షాక్‌కు గురి చేసే వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఐకియాలో వ‌డ్డించిన వెజ్‌ బిర్యానీలో గొంగ‌ళి పురుగు క‌నిపించింది. శుక్ర‌వారం ఐకియా షోరూమ్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. వెంట‌నే ఆ వినియోగ‌దారుడు గ్రేట‌ర్ హైద‌రాబాద్ కార్పొరేష‌న్ పుడ్ సేప్టీ అధికారుల‌కు ఫిర్యాదు చేశాడు.

దీంతో స్పందించిన అధికారులు ఆ పుడ్‌ను సీజ్ చేశారు. ప్రాథ‌మిక విచార‌ణ త‌ర్వాత ఐకియా షోరూమ్ నిర్వాహ‌కుల‌కు 11 వేల 500 రూపాయ‌ల ఫైన్ విధించారు. అంతేకాదు ఐకియా,పుడ్ స‌ప్ల‌య్ చేసిన హ‌ల్దీరామ్ కంపెనీకి నోటీసులు జారీ చేశారు.

ఇటు ఐకియా నిర్వాహ‌కులు కూడా జ‌రిగిన త‌ప్పిదంపై వినియోగ‌దారుడికి క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. త‌న‌కు స‌ర‌ఫ‌రా చేసిన వెజ్ బిర్యానీ..తాము వండ‌లేద‌ని….నాగ్‌పూర్ కంపెనీ హ‌ల్దీరామ్ స‌ర‌ఫ‌రా చేసింద‌ని వివ‌రించారు. త‌ప్పు ఎక్క‌డ జ‌రిగిందో తెలుసుకుని చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అన్నారు. ఇప్ప‌టికే నాగ్‌పూర్ కంపెనీతో మాట్లాడుతున్నామ‌ని తెలిపింది. అయితే పుడ్ సప్ల‌య్ లో ఐకియా షోరూమ్ నిర్వాహ‌కుల నిర్ల‌క్ష్యం ఉంద‌ని అధికారులు చెబుతున్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES