ఇవాంకా ముందు భార‌త గ‌న్‌లు వ‌ద్దు….

539

అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ 8వ గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌(జీఈఎస్)లో పాల్గొనేందుకు వైట్‌హౌస్‌ సలహాదారు హోదాలో హైద‌రాబాద్ వస్తున్నారు. ఆమె ప‌ర్య‌ట‌న కోసం భారీ భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు అమెరికా అధ్య‌క్షుడి త‌ర‌హాలోనే భ‌ద్ర‌త క‌ల్పిస్తున్నారు. నెల రోజులుగా అమెరికా  భ‌ద్ర‌తా అధికారులు హైద‌రాబాద్‌లోనే మ‌కాం వేశారు.

ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేస్తూ  ఇవాంకా భ‌ద్ర‌త విష‌యంలో ప‌లు  సూచ‌న‌లు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాంకా ట్రంప్‌కు ద‌గ్గ‌ర‌లో భార‌త పోలీసులు ఎవ‌రూ గ‌న్‌లు తీసుకుని ఉండ‌కూడ‌ద‌ని ష‌ర‌తు పెట్టింది. టర్కీలో భద్రత విధులకు వచ్చిన స్థానిక పోలీసు అధికారి రష్యన్‌ అంబాసిడర్‌పై కాల్పులు జరిపిన ఘటన నేపథ్యంలో అమెరికా భద్రతా విభాగం జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఇవాంకతో పాటు ప్రధాని మోదీ కూడా స‌మ్మిట్‌లో పాల్గొంటున్నారు. ప్రధాని భద్రత బాధ్యతలు నిర్వర్తించే ఎస్పీజీ నిరంతరం ఆయనకు నీడలా కాపలా ఉంటుంది. ఇవాంకా చుట్టూ భార‌త పోలీసులు తుపాకుల‌తో ఉండ‌కూడద‌ని అమెరికా భద్రత అధికారుల కోరిక నేపథ్యంలో ఏం చేయాలనేది చర్చిస్తున్నారు.  ఇవాంకా కోసం 60 వాహ‌నాల‌తో కాన్వాయ్ ఏర్పాటు చేస్తున్నారు. కాన్వాయ్ కోసం అమెరికానుంచి విమానాల్లో ప్ర‌త్యేకంగా 20 కార్లను తెస్తున్నారు. హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లోని సెల్‌ఫోన్లపై కూడా నిఘా పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఫలక్‌నూమా ప్యాలెస్‌ చుట్టు పక్కల ప్రాంతాల్లో తాత్కాలికంగా 500 సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేసి ప్రత్యేక కంట్రోల్‌రూంతో పర్యవేక్షించనున్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES