జక్కా వెంకయ్య అస్తమయం

1010

పుచ్చలపల్లి సుందరయ్య పెద్దమ్మ మనవడు, మార్క్సిస్టు పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జక్కా వెంకయ్య (88) ఈరోజు ఉదయం నెల్లూరులోని సింహపురి ఆసుపత్రిలో మృతిచెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.

నెల్లూరు జిల్లా దామరమడుగులో జన్మించిన వెంకయ్య చిన్నప్పటి నుంచీ పుచ్చలపల్లి సుందరయ్య, డాక్టర్‌ రామచంద్రా రెడ్డిలతో కలిసి పెరిగారు. దాంతో ఆయన మీద వాళ్ళ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల చిన్నప్పటి నుంచి మరణించే వరకు మార్క్సిస్టుగా జీవించారు.

ఆయన రెండు సార్లు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. ఆయన రాజకీయ ఆర్థికశాస్త్రం, గతితార్కిక భౌతికవాదం, చారిత్రక భౌతికవాదం అనే పుస్తకాలు రాశారు. నెల్లూరు జిల్లాలో అనేకమంది మార్క్సిజం వైపు మొగ్గడానికి ఈయన కారణం. వ్యవసాయ కార్మిక ఉద్యమాల్లో, భూ పోరాటాల్లో ఆయన చాలా ముఖ్యమైన పాత్ర వహించారు. సుందరయ్య లాగే అత్యంత నిరాడంబరంగా జీవించారు.

NEWS UPDATES

CINEMA UPDATES