బాబు రెడ్ల తోకలను కత్తిరించి సున్నం పెట్టారు….

2763

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో, కేంద్రంలో మంత్రులను డమ్మీలుగా మార్చేశారన్నారు. నిర్ణయాలు తీసుకునే అధికారం గానీ, అవకాశం గానీ మంత్రులకు లేదన్నారు. కేంద్రంలో మోడీ, ఏపీలో ముఖ్యమంత్రిదే ఇష్టారాజ్యంగా ఉందన్నారు. మంత్రులకు కనీసం
స్వేచ్చగా మాట్లాడే అవకాశం కూడా లేదన్నారు.

మంగళవారం అసెంబ్లీ లాబీల్లోకి వచ్చిన ఎంపీ… రాష్ట్రంలో రెడ్ల తోకలను చంద్రబాబు కత్తిరించారని వ్యాఖ్యానించారు. అవి తిరిగి పెరగకుండా సున్నం కూడా పెట్టేశారని వ్యాఖ్యానించారు జేసీ. వైఎస్‌ పేరు చెప్పుకొనే రోజులు పోయాయని, ఇక అరిగిపోయిన ఆ రికార్డు
తిప్పడం మానుకోవాలని జగన్‌కు హితవు పలికారు. ఎలాగూ బాగా సంపాదించారు కాబట్టి రాజకీయాలు వదిలేసి మంచి పారిశ్రామికవేత్తగా ఎదగాలని జగన్‌కు
సూచించారు.

‘చిరంజీవికీ జనం వచ్చారు. పవన్‌ కల్యాణ్‌కూ వస్తున్నారు. రోజా పెట్టినా వస్తారు. హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వచ్చినా జనం ఎగబడతారు. మాకే ఒక్కడూ రాడు’ అని సరదాగా వ్యాఖ్యానించారు దివాకర్‌ రెడ్డి.
———

NEWS UPDATES

CINEMA UPDATES