స్టేష‌న్‌లో మ‌సాజ్‌…. వేటు వేసిన ఐజీ

593

జోగులాంబ గ‌ద్వాల‌లో ఏఎస్‌ఐ బ‌రి తెగించారు. ఒక మ‌హిళా హోంగార్డుతో మసాజ్ చేయించుకుంటూ కెమెరాకు దొరికిపోయాడు. స్టేష‌న్ లో విశ్రాంతి గ‌దిలోనే మ‌హిళా హోంగార్డుతో మ‌సాజ్ చేయించుకున్నాడు. హోంగార్డుల‌ను బానిస‌ల్లా చూస్తున్న ఏఎస్‌ఐ హ‌స‌న్‌.. చాలా రోజులుగా ఇదే త‌ర‌హాలో మ‌సాజ్ చేయించుకుంటున్నారు. మ‌హిళ అన్న భావ‌న కూడా లేకుండా ఆమె ఆత్మ‌గౌర‌వంతో ఏఎస్‌ఐ హ‌స‌న్ ఆడుకోవ‌డంపై విసిగిపోయిన కొంద‌రు సిబ్బంది ఆ దృశ్యాల‌ను రికార్డు చేసి బ‌య‌ట‌కు వ‌దిలారు. దీంతో ఈ వీడియో పోలీస్ శాఖ‌లో క‌ల‌క‌లం రేపింది. పోలీస్ వ్య‌వ‌స్థ‌లో బానిస‌త్వాన్ని బ‌య‌ట‌పెట్టింది. దీంతో ఆగ్ర‌హించిన ఐజీ స్టీఫెన్ ర‌వీంద్ర‌…. ఏఎస్‌ఐ హ‌స‌న్‌ను స‌స్పెండ్ చేశారు. ఈ ఉదంతంపై విచార‌ణ‌కు ఆదేశించారు. జోగులాంబ గద్వాల్‌ సాయుధ రిజర్వ్ ఏఎస్ఐగా హసన్ ప‌నిచేస్తున్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES