దుకాణం సర్దేసిన జూలీ

217

జూలీ-2.. ఈ సినిమాపై రాయ్ లక్ష్మీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. బాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిపోదామని కలలుకంది. అందుకే కెరీర్ లో ఎన్నడూ లేనంతగా అందాలు ఆరబోసింది. అయినా ప్రయోజనం లేకపోయింది. జూలీ-2 సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇది ఏ రేంజ్ ఫ్లాప్ అంటే… 2017 బిగ్గెస్ట్ డిజాస్టర్లలో జూలీ-2 కూడా చేరిపోయింది.

విడుదలైన ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమాకు కేవలం 2 కోట్ల 50లక్షల రూపాయల వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఓ బాలీవుడ్ సినిమాకు వారం రోజుల్లో 2 కోట్ల 50లక్షల వసూళ్లు అంటే అంతకంటే హీనం ఇంకోటి ఉండదు. విడుదలైన మొదటి రోజు మొదటి ఆటకే సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో.. ఇక రెండో ఆట నుంచి జనాలు థియేటర్లవైపు చూడ్డం మానేశారు.

ఇటు తమిళ వెర్షన్ ది కూడా అదే పరిస్థితి. రాయ్ లక్ష్మీకి మంచి ఫాలోయింగ్ ఉన్న కోలీవుడ్ లో కూడా ఇది ఫ్లాప్ అయిందంటే.. సినిమాలో కంటెంట్ ఏంత పూర్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాయ్ లక్ష్మీ అందాల్ని వెండితెరపై నిండుగా చూడొచ్చని తమిళ ప్రేక్షకుడు ఊహించాడు. కానీ వాళ్లు ఊహించింది ఒకటి సినిమాలో ఉన్నది ఇంకోటి. ట్రయిలర్ లో చూపించినవి మినహా సినిమాలో కొత్తగా ఏం లేకపోవడంతో కోలీవుడ్ లో కూడా జూలీ-2 ఫ్లాప్ అయింది.

NEWS UPDATES

CINEMA UPDATES