బ‌తుక‌మ్మ చీర త‌ర‌హాలో మైసూర్ సిల్క్ చీర

1002

ప‌ట్టుచీర అంటే మ‌హిళ‌ల‌కు ఎంతో ఇష్టం. పండుగ సీజ‌న్ వ‌చ్చిందంటే చాలు… కొత్త కొత్త ప్రచారాలతో హోరెత్తించడం ఖాయం. ఇప్పుడు ఇదే త‌ర‌హాలో ప్ర‌భుత్వాలు కూడా పండ‌గ‌ల వేళ మ‌హిళ‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు కొత్త కొత్త ఆఫ‌ర్లు ఇస్తున్నాయి. తెలంగాణ ప్ర‌భుత్వం ద‌స‌రాకు బ‌తుక‌మ్మ చీర‌లు పంపిణీ చేస్తోంది. గ‌త ఏడాది పంపిణీ చేసింది. వాటి నాణ్య‌త‌పై ర‌చ్చ జ‌రిగింది. ఈసారి క్వాలిటీ విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది.

ఇప్పుడు ఇదే త‌ర‌హాలో

వినాయక చవితిని పురస్కరించుకుని కర్ణాటక ప్రభుత్వం మహిళలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప‌ది వేల రూపాయల విలువ గల మైసూర్ సిల్క్ చీరను డిస్కౌంట్ కింద నాలుగున్నర వేలకే విక్రయిస్తున్నట్లు తెలిపింది. దీంతో మైసూర్ నగరంలోని కర్ణాటక సిల్క్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఔట్‌లెట్‌ ముందు మహిళలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు.

ఉదయం ఐదు గంటల నుంచే మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో కిలోమీటర్ల మేర నిలబడ్డారు. అయితే ఆధికారులు ఒక కండీష‌న్ పెట్టారు. ఆధార్ కార్డు ఉండాలి. లైన్లో వ‌చ్చి వెబ్‌సైట్‌లో న‌మోదు చేసుకోవాలి. 1500 ప‌ట్టు చీర‌లు మాత్ర‌మే పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించ‌డంతో మ‌హిళ‌లు నిరాశ చెందారు.

అయితే మిగ‌తా చీర‌లు జ‌రీ, సిల్క్ చీర‌లు పంపిణీ చేస్తామ‌ని అధికారులు తెలిపారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి చేతుల మీదుగా డిస్కౌంట్‌పై చీరల విక్రయాన్ని ప్రారంభిస్తామన్నారు. ఉదయం పదిగంటలకు స్టోర్ తెరవనుండగా…. తెల్లవారు జాముకే మహిళలు పెద్ద సంఖ్యలో రోడ్డుపై బారులు తీరడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.

NEWS UPDATES

CINEMA UPDATES