ప‌వ‌న్‌పై మ‌ళ్లీ క‌త్తి మ‌హేష్ సెటైర్లు

1742

సినీ విమర్శకుడు కత్తి మహేష్ మరోసారి పవన్ కళ్యాణ్ మీద సెటైర్లు వేశారు. విశాఖపట్నంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ చేసిన ప్రసంగం మీద ఆయన విమర్శలు, ప్రశ్నలు గుప్పించారు. ట్విట్ట‌ర్ అకౌంట్‌లో మ‌హేష్ క‌త్తి వేసిన సెటైర్లు ఇవి….

1.సీఎం అవ్వడం కష్టం, కానీ అన్నయ్య లాగా పార్టీ ని కలిపేయడం తద్యం……. ఎందుకంటే ప్యాకేజీ

2. సో… మొత్తానికి జనసేన ముఖ్య ఉద్దేశం ప్రజారాజ్యం పార్టీని, చిరంజీవిని మోసం చేసినవాళ్ళని చెప్పుతో కొట్టడం అన్నమాట! అది కాంగ్రెస్ తో కలిస్తేనే సాధ్యం అని చెప్పకనే చెప్పాడు. కక్ష సాధింపు ముఖ్యమైనప్పుడు లక్ష్య సాధన ఏముంటుంది?!?

3. నిజమే! తండ్రి ముఖ్యమంత్రి అయితే కొడుకు ముఖ్యమంత్రి అవ్వాలని రూల్ ఏమీలేదు. అలాగే అన్న హీరో అయితే తమ్ముడూ హీరో అవ్వాలని లేదుగా!? వారసత్వం మన ఫ్యూడల్ భావజాలపు బానిస భావన. అది అన్ని రంగాల్లో పోవాలి. కాకపోతే ఎర్ర గురివింద తన నలుపెరగనట్టు మాట్లాడితేనే నవ్వొస్తుంటుంది.

4.తప్పు చేస్తే నన్ను కూడా నిలదీయండి! పొరపాటు చేస్తానేమోగాని.. తప్పు మాత్రం చేయను! – పవన్ కళ్యాణ్

5. ముందు మీ ఫ్యాన్స్ చేస్తున్న గుండాయిజాన్ని ఆపే మంచి పనిచెయ్యి. లేకపోతే, తప్పో పొరపాటో కాదు, మీకు మీ పార్టీకి అదొక గ్రహపాటుగా మారే చాన్స్ ఉంది.

6.పార్టీ ఆఫీసుని సినిమా ఆఫీసులా, ప్రజా ప్రస్థానాన్ని ఆడియో లాంచ్ లాగా మార్చడమే కొత్తతరహా రాజకీయం.

7. అన్నను, పి.ఆర్.పి ని మోసం చేసినవాళ్ళ సంగతి సరే…మరి అన్న గారు జనానికి, కులానికి,పార్టీకి చేసిన మోసం సంగతో!!?

NEWS UPDATES

CINEMA UPDATES