మోడీ అహంకారాన్ని వీడండి…. నియంత పాల‌న వ‌ద్దు బాబు

653

మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత కావూరి సాంబ‌శివ‌రావు ప్ర‌ధానిపై ఘాటు వ్యాఖ్య‌లే చేశారు. ప్ర‌ధానిని పొగుడుతూనే ఆయ‌న్ను అహంకారిగా అభివ‌ర్ణించారు. ప్ర‌ధాని మోడీ అహంకారాన్ని వీడాల‌ని అప్పుడే దేశానికి మంచిద‌ని కావూరి వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా గుడివాడ‌లో మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌…. ప్ర‌స్తుత రాజ‌కీయాలు పూర్తిగా భ్ర‌ష్టుప‌ట్టాయ‌ని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు సంపాద‌నే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నార‌ని ఆరోపించారు. సంపాద‌న సంగ‌తి ప‌క్క‌న పెట్టి ఇప్ప‌టికైనా ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే ప‌నులు చేయాల‌ని కోరారు.

యూపీఏ కేబినెట్‌లో తానుప‌నిచేశాన‌ని… ఆ కేబినెట్‌లో ఒక్క ఏకే అంటోని మాత్ర‌మే నిజాయితీప‌రుడ‌న్నారు. మోడీ కేబినెట్‌లో మంత్రులు మాత్రం అవినీతికి పాల్ప‌డ‌కుండా ప‌నిచేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు పాల‌న నియంత‌ల త‌ర‌హాలో ఉంద‌న్నారు. చివ‌ర‌కు మిత్ర‌ప‌క్ష‌మైన‌ బీజేపీని కూడా టీడీపీ క‌లుపుకుపోకుండా నియంతలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మోడీని అహంకారి అని విప‌క్షాలు మాత్ర‌మే విమ‌ర్శించేవి. ఇప్పుడు బీజేపీ నేత కావూరి కూడా అహంకారాన్ని వ‌దిలేయాల‌ని ప్ర‌ధానికి సూచించారు.

NEWS UPDATES

CINEMA UPDATES