మహిళల స్టీపుల్ చేజ్ పరుగులో సరికొత్త ప్రపంచ రికార్డు

2398
  • చరిత్ర సృష్టించిన కెన్యా రన్నర్ బెట్రీషియా చెప్ కోచ్
  • స్టీపుల్ చేజ్ ను 8 నిముషాల 44.32 సెకన్లతో పూర్తి చేసిన చెప్ కోచ్

మహిళల స్టీపుల్ చేజ్ పరుగులో కెన్యా రన్నర్ బెట్రీషియా చెప్ కోచ్ సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేసింది.

మొనాకో వేదికగా జరిగిన డైమండ్ లీగ్ మహిళల స్టీపుల్ చేజ్ పరుగులో…. 27 ఏళ్ల బెట్రీషియా చెప్ కోచ్…. 8 నిముషాల 44.32 సెకన్ల రికార్డుతో చరిత్ర సృష్టించింది.

2016 ప్రపంచ మీట్ లో బెహ్రయిన్ రన్నర్ రూత్ జెబెట్ నెలకొల్పిన 8 నిముషాల 52.78 సెకన్ల రికార్డును…8 సెకన్ల సమయంతో కెన్యా అథ్లెట్ చెప్ కోచ్ తెరమరుగు చేసింది.

2016 రియో ఒలింపిక్స్, 2017 లండన్ ప్రపంచ మీట్ లలో చెప్ కోచ్ ….నాలుగో స్థానం మాత్రమే సాధించగలిగింది.

NEWS UPDATES

CINEMA UPDATES