నెటిజ‌న్ల‌ను కంట‌త‌డి పెట్టిస్తున్న లినీ లేఖ‌

4293

కేరళలో నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది. కోళికోడ్(కాలికట్) జిల్లాలో ఈ వ్యాధి ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి ప‌దిహేను మందికి పైగా మృత్యువాత పడ్డారు. మరికొందరి పరిస్థితి విషమంగా వున్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ వ్యాధి సోకిందనే అనుమానాలతో దాదాపు 25మందిని అబ్జర్వేషన్‌లో ఉంచారు. దీంతో ఆరోగ్యశాఖ అధికారులు హై అలర్ట్‌ జారీ చేశారు.

అయితే నిఫా వైరస్‌ దక్షిణ భారత దేశంలో కనిపించడం ఇదే తొలిసారి. ఈ ప్రాణాంతక వైరస్‌ పట్ల కేరళతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. తొలిసారిగా నిఫా వైరస్ ను 1998లో మలేసియాలో కనుగొన్నారు. అప్పట్లో మలేసియాలో 105 మంది ఈ వ్యాధితో మృతి చెందారు. ఆ తర్వాత సింగపూర్‌లోనూ ఈ వైరస్ ను కనుగొన్నారు. పందులను పెంచే పశుపోషకులు ఈ వ్యాధి బారిన పడి మృతి చెందారు.

నిఫాను కట్టడి చేయాలంటే ఎవరికి వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. భోజనం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. పండ్లు, ఫలాలను శుభ్రం చేయకుండా తిన వద్దు. ఈ నిఫా నివారణకు మందులు లేవని, ప్రాథమిక దశలో గుర్తించిన పక్షంలో ప్రత్యేక చికిత్సతో నివారించవచ్చని వైద్యులు అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో నిఫా వైర‌స్ తో కేర‌ళ ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. అయితే ఈ చనిపోయిన వారిలో ఇద్ద‌రు న‌ర్సులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ వ్యాధి సోకిన బాధితులకు చికిత్స చేయ‌డంతో న‌ర్సుల‌కు సోకింది. ఆ న‌ర్సుల్లో  లినీ అనే నర్సు ఈ వ్యాధి సోకి మ‌ర‌ణించింది. ఆమె మ‌ర‌ణానికి ముందు త‌న‌ భ‌ర్త‌కి లేఖ‌రాసింది. ఇప్పుడా లేఖ కంట‌త‌డి పెట్టిస్తుంది.

నిఫా వ్యాధిసోక‌డంతో బాధితుల భౌతిక‌కాయాల్ని వారి కుటుంబ‌స‌భ్య‌ల‌కు అప్ప‌గించ‌కుండా ….ద‌హ‌న‌ సంస్కారాలు నిర్వ‌హిస్తున్నారు. 

అలా లినీ భౌతిక‌కాయానికి ద‌హ‌న‌ సంస్కారాలు నిర్వ‌హించ‌గా…. ఆమె మ‌ర‌ణానికి ముందు త‌న భ‌ర్త‌కు రాసిన లేఖ నెట్టింట్లో వైర‌ల్ అయ్యింది.

 నేను చనిపోబోతున్నానని నాకు తెలుసు. నిన్ను కలుసుకునే సమయం లేదని కూడా తెలుసు. మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో… నీతో పాటు వాళ్లను గల్ఫ్‌కు తీసుకెళ్లు… నేనులేను అని మా నాన్నలానే జీవితాంతం ఒంటరిగా ఉండకు… ఇవి నిఫా వైరస్‌ సోకి మరణశయ్యపై ఉన్న నర్సు లినీ(31) తన భర్తకు లేఖ రాశారు. 

 లినీ మరణంపై స్పందించిన డాక్టర్‌ దీపూ సెబిన్‌ దేశ ప్రజల రక్షణలో భాగస్వామ్యమై ప్రాణాలు వదిలిన లినీ వీర మరణం పొందారని, ఆమె అమరవీరురాలు కాకపోతే మరెవరో తనకు తెలియదని వ్యాఖ్యానించారు.  

NEWS UPDATES

CINEMA UPDATES