నాని సినిమాపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

333

మూడు రోజుల నుంచి నాని కొత్త సినిమాపై ఒకటే వార్తలు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో నేచురల్ స్టార్ ఓ సినిమా చేయబోతున్నాడని, ఆ మూవీకి చిత్రలహరి అనే టైటిల్ పెట్టారని తెగ వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు వీటిపై స్పందించాడు దర్శకుడు కిషోర్ తిరుమల. ఉన్నది ఒక్కటే జిందగీ మూవీ ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన కిషోర్ తిరుమల.. నాని కోసం అనుకుంటున్న కథను పూర్తిస్థాయిలో ఇంకా డెవలప్ చేయలేదని కుండబద్దలుకొట్టాడు.

“ప్రస్తుతం నా దగ్గర 3 కథలున్నాయి. అన్నీ ప్రాధమిక దశలోనే ఉన్నాయి. ఏ స్టోరీని ఇంకా డెవలప్ చేయలేదు. అందులో వెంకటేష్, నానికి చెప్పిన కథలు కూడా ఉన్నాయి. నానికి కథ చెప్పిన మాట వాస్తవమే. కానీ అది పూర్తి కథ కాదు. జస్ట్ లైన్ మాత్రమే. దాన్ని ఇంకా పూర్తిస్థాయిలో విస్తరించాల్సి ఉంది. కథ డెవలప్ చేయడంతో పాటు స్క్రీన్ ప్లే కూడా రాసుకోవాలి. ఆ తర్వాత అది నానికి నచ్చాలి. అప్పటివరకు ఈ ప్రాజెక్టు గురించి అప్పుడే ఏం చెప్పలేం.” నానితో చేయాల్సిన సినిమాపై కిషోర్ తిరుమల వెర్షన్ ఇది.

చిత్రలహరి అనే టైటిల్ కూడా చర్చకు రాలేదని ప్రకటించాడు ఈ దర్శకుడు. తన స్టయిల్ ప్రకారం ముందు 6 నెలలు గ్యాప్ తీసుకొని స్టోరీ రాసుకుంటానని, తర్వాత ఆ స్టోరీకి తగ్గ హీరోను సెలక్ట్ చేసుకుంటానని.. ఆ తర్వాత హీరోకు తగ్గట్టు టైటిల్ ఫిక్స్ చేస్తానని అంటున్నాడు కిషోర్ తిరుమల.

NEWS UPDATES

CINEMA UPDATES