సెక్రటేరియట్ కే రాని ముఖ్యమంత్రి…. ఇంకేం పాలన చేస్తాడు?

615

మీ ఒక్క కుటుంబం కోసం కాదు తెలంగాణ తెచ్చుకున్నది. మీ కుటుంబ పాలన కోసం అంతకంటే కాదు. యావన్మంది కోసం తెలంగాణ తెచ్చుకున్నం. మీ ఇసుక కాంట్రాక్టుల కోసం తెలంగాణ తెచ్చుకోలేదు. ఐకెపి ఉద్యోగులు సమ్మె చేస్తుంటే పిలిచి మాట్లాడొద్దా? గురుకుల టీచర్లు టిఫిన్ తింటుంటే టిఫిన్ పక్కన పడేసి అరెస్టు చేసిన్రు. సింగరేణి ఉద్యోగులకు దసరాకు ఓటేయండి. దీపావళికి ఉద్యోగాలు తీసుకుపోండి అన్నారు. దసరా, దీపావళి పోయి సంక్రాంతి వస్తున్నది. ఇచ్చారా? అంటూ కొలువుల కోసం కొట్లాట స‌భ‌లో జేఏసీ ఛైర్మ‌న్ కోదండ‌రాం ప్ర‌శ్నించారు.

ఈ స‌భ‌లో కేసీఆర్ టార్గెట్‌గా కోదండ‌రాం పంచ్‌లు విసిరారు. రాజకీయ నిరుద్యోగం అని నన్ను అంటున్నరు. నువ్వు రాజకీయం చేసుకుంటూ నన్ను రాజకీయం చేస్తున్నావని అడిగితే నాకు సిగ్గు అనిపిస్తున్నది. నువ్వు ఆ కుర్చీ దిగి పదవి నుంచి బయటకొచ్చి రాజకీయం చేస్తున్నావని అంటే బాగుంటది. నా ఇష్టానుసారంగా పాలన చేస్తా అంటే కుదరదు. ముఖ్యమంత్రి చాలా మంది మంత్రులకే దొరుకుతలేడు. మనకేం దొరుకుతడు. ఆయనకు ఏమైనా చెబుదామంటే వినడు, చూడడు. సెక్రటేరియట్ కే రాడు. ఇంకేం పాలన చేస్తడు. ఇంకేం యువతకు న్యాయం చేస్తడు అని కోదండ‌రాం పంచ్‌లు విసిరారు.

మేమేం అడిగినం.. మీ కుర్చీలు అడిగినమా? మణులు అడిగినమా మాణిక్యాలు అడిగినమా? మా ఉద్యోగాలు కావాలని అడిగినం. ఉద్యోగ క్యాలెండర్ ఇయ్యమని అడిగినం. అధికారంలోకి రాగానే మన ఉద్యోగాల కోసం మొదటి ఫైలుపై సంతకం చేయాల్సి ఉండే. కానీ ఆ పని కాలేదు. విద్యార్థుల అసహనాన్ని అర్థం చేసుకుని మేమే ఈ పోరాటానికి పిలుపునివ్వాల్సి వచ్చిందని కోదండ‌రాం అన్నారు.
తెలంగాణలో రెండు లక్షల నుంచి 3లక్షల వరకు ఖాళీలు ఉన్నయని మేము అంకెలు ఇచ్చినం. మేము ఇచ్చిన అంకెలపై, గణాంకాలపై నిలబడేందుకు సిద్ధంగా ఉన్నాం. సర్కారు చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలు. మోసపూరిత లెక్కలు. తక్షణమే ప్రభుత్వం ఉన్న ఖాళీలన్నీ యదాతదంగా భర్తీ చేయాలి. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వాలి. గ్రూప్ 2 నోటిఫికేషన్ మళ్లీ ఇంకోటి ఇవ్వాలి. కేవలం పోలీసు ఉద్యోగాలే వేస్తున్నారు. ఏజ్ రిలాక్సేషన్ లేదు. వెంటనే ఏజ్ రిలాక్సేషన్ ఇయ్యాలి.

తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ ఖాళీలు అవుతున్నాయి. వాటిని కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. భర్తీ చేస్తామన్నాం కదా? ఇంకెందుకు అడుగుతున్నారు అని అంటున్నది ప్రభుత్వం. కొట్లాట సభలెందుకు అని అంటున్నది. కానీ.. క్యాలెండర్ విడుదల చేయకుండా మాకు నమ్మకం కుదరదు. కచ్చితంగా క్యాలెండర్ కోసం పోరాటం చేస్తాం. సాధించుకుంటామని కూడా అందరికీ హామీ ఇస్తున్నామ‌ని చెప్పారు.

ఎట్టి పరిస్థితుల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేయనివ్వం అని స్పష్టం చేస్తున్నాం. మేమొస్తే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉండనే ఉండవు అన్న టిఆర్ఎస్ పార్టీ ఇంకా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కోసం నోటిఫికేషన్లు వెలువరిస్తూనే ఉన్నది. ఆ నోటిఫికేషన్లు అన్నీ సవరించి మంచి జీతాలతో ఉద్యోగాలు ఇవ్వాలి. అందులో హోంగార్డుల ఇష్యూ కూడా ఉంది. పోలీసులతో సమానంగా హోంగార్డులకు కూడా జీతాలివ్వాలని కోరారు. అందరికీ గవర్నమెంటులో ఉద్యోగాలు దొరకవు. ప్రయివేటు పరిశ్రమలున్నాయి. ఐటి రంగం ఉంది. ఇన్సూరెన్స్ రంగం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలున్నాయి. ఇవన్నింటిలో భూమిపుత్రులకే ఉద్యోగాలు ఇవ్వాలి. స్థానికులకే ఇవ్వాలి. నిజంగా ప్రయివేటు రంగంలో 2లక్షల ఉద్యోగాలు కల్పించామని ప్రభుత్వం చెబుతున్నది. ప్రైవేటు రంగంలో ఉద్యోగాల క‌ల్ప‌న‌పై శ్వేత‌ప‌త్రం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు కోదండ‌రాం. పాలకులు కాంట్రాక్టర్ల మీద చూపిన మోజు, ఇసుక రవాణా మీద చూపిన మోజు నిరుద్యోగుల మీద చూపడం లేదు.

NEWS UPDATES

CINEMA UPDATES