బోటు వెనుక గుంటూరు మంత్రి…. ప్రముఖ ఆంగ్లపత్రిక ఆస‌క్తిక‌ర క‌థ‌నం

2604

కృష్ణా న‌ది బోటు ప్ర‌మాదం ప్ర‌భుత్వంలోని మాఫియాను మ‌రోసారి ఎత్తిచూపింది. అనుమ‌తి లేకున్నా ప్రైవైట్ బోట్లు విచ్చ‌ల‌విడిగా విహ‌రించ‌డం వెనుక అధికారులు, ప్రైవేట్ వ్య‌క్తులు, మంత్రుల క‌మ్ముక్కు ఉన్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. తాజాగా ప్ర‌ముఖ ఆంగ్ల పత్రిక ఒక క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. 22 మందిని పొట్ట‌న‌పెట్టుకున్న బోటు వెనుక గుంటూరు జిల్లా మంత్రి ప్ర‌మేయం ఉన్న‌ట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారంతో క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. టూరిజం శాఖ విజిలెన్స్ సిబ్బంది కొంద‌రు కొన్ని రోజుల క్రితం ఇదే బోటును సీజ్ చేశారు.

అనుమ‌తి లేకుండా తిరుగుతుండ‌డంతో సీజ్ చేసిన‌ట్టు చెబుతున్నారు. అయితే బోటును సీజ్ చేసిన వెంట‌నే గుంటూరు జిల్లా మంత్రి నుంచి విజిలెన్స్ అధికారుల‌కు ఫోన్ వ‌చ్చిన‌ట్టు డీసీ ప్ర‌తిక క‌థ‌నం. బోటు మ‌న‌వాళ్ల‌దే వెంట‌నే వదిలేయాల‌ని స‌దరు మంత్రి ఆదేశించారు. దీంతో వెంట‌నే బోటు తిరిగి జ‌ల‌ప్ర‌వేశం చేసింది. ఈ ప్రైవేట్ బోట్ల వెనుక రాజ‌కీయాల నాయకులు, అధికారులు సిండికేట్ బ‌లంగా ఉంద‌ని ప‌త్రిక త‌న‌కున్న సమాచారంతో వివ‌రించింది.

ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించే పేరుతో ప్ర‌భుత్వం ప్రైవేట్ బోట్ల‌ను అనుమ‌తిస్తోంద‌ని.. కానీ ప‌ర్యాట‌కుల భ‌ద్ర‌త కోసం వారు తీసుకునంటున్న చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షించే వ్య‌వ‌స్థ మాత్రం ప్ర‌భుత్వంలో లేద‌ని చెబుతున్నారు. కేవ‌లం గుంటూరు మంత్రి అధికారుల‌కు ఫోన్ చేసి బోటును విడిపించి ఉండ‌క‌పోతే… 22 మందిని పొట్ట‌న‌పెట్టుకునే ప్ర‌మాదం జ‌రిగేది కాద‌ని పత్రిక అభిప్రాయ‌ప‌డింది.

NEWS UPDATES

CINEMA UPDATES