మరో షెడ్యూల్ ఫిక్స్ చేసిన బాలకృష్ణ

344

బాలకృష్ణ 102వ చిత్రం శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మినిమం గ్యాప్స్ లో బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంటోంది. తాజాగా హైదరాబాద్ లోని మూసాపేట్ లో ఓ భారీ షెడ్యూల్ కంప్లీట్ చేసిన యూనిట్… త్వరలోనే మరో భారీ షెడ్యూల్ కు రంగం సిద్ధం చేస్తోంది. ఈసారి ప్లేస్ మారింది. విశాఖకు షిఫ్ట్ అవుతోంది యూనిట్.

ఈనెల 23 నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభమౌతుంది. వైజాగ్ లో 20 రోజుల పాటు ఈ షెడ్యూల్ ప్లాన్ చేశారు. కొత్త షెడ్యూల్ లో హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ తో వచ్చే మరికొన్ని సీన్స్ తీయబోతున్నారు. చిరంతన్ భట్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

సీకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన నయనతార, నటాషా, హరిప్రియ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ సినిమాను సంక్రాంతి బరిలో నిలపాలనేది ప్లాన్. కానీ అంతకంటే ముందే సినిమా సిద్ధమైపోతుంది. ఈ సినిమాకు రెడ్డిగారు లేదా జయసింహ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు. విశాఖ షెడ్యూల్ తర్వాత టైటిల్ ప్రకటించే ఛాన్స్ ఉంది.

NEWS UPDATES

CINEMA UPDATES