పవన్ కు గుడ్ బై చెప్పేసిన ఖుష్బూ

287
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఖుష్బూ టాటా చెప్పేసింది. ఫైనల్ గా త్రివిక్రమ్ తో ఓ సెల్ఫీ కూడా దిగింది. అజ్ఞాతవాసి లొకేషన్లో ఈరోజు జరిగిన సన్నివేశాలివి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ప్యాచ్ వర్క్ లో భాగంగా ఈరోజు ఖుష్బూపై కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. ఈ షూట్ తో అజ్ఞాతవాసి సినిమాకు సంబంధించి ఖుష్బూ యాక్షన్ పార్ట్ పూర్తయింది.
మరోవైపు హీరోయిన్లు కీర్తిసురేష్, అను ఎమ్మాన్యుయేల్ కూడా తమ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేశారు. ప్రస్తుతానికి పవన్ పై కొంత ప్యాచ్ వర్క్ మాత్రం పెండింగ్ ఉంది. ఈ వారాంతానికి అది కూడా కంప్లీట్ అయిపోతుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ కూడా ఓ కొలిక్కి వస్తోంది. అను, కీర్తి తమ క్యారెక్టర్లకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్న విషయం తెలిసిందే.
సంక్రాంతి కానుకగా జనవరి 10న అజ్ఞాతవాసి సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ నెల రెండో వారంలో ఈ సినిమా ఆడియోను రిలీజ్ చేస్తారు. ఆడియో ఫంక్షన్ ఎక్కడ సెలబ్రేట్ చేస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

NEWS UPDATES

CINEMA UPDATES