ఎర్రగడ్డ వద్దు…. బాబును స్విడ్జర్లాండ్‌ పిచ్చాసుపత్రికి తరలించాలి….

1368

చంద్రబాబు ప్రచారం గోబెల్స్‌ను మించిపోయిందన్నారు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండానే చంద్రబాబు ప్రజల సొమ్ముతో ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.

పోలవరం ప్రాజెక్ట్‌లో స్పిల్‌వే గ్యాలరీ అన్నది చాలా చిన్న విషయమని…. దాన్ని పట్టుకుని ఏకంగా ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితమిచ్చినట్టుగా చంద్రబాబు ప్రచారం చేసుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

చంద్రబాబు చేస్తున్న గ్యాలరీవాక్‌, క్యాట్‌ వాక్‌లు చూస్తుంటే ఎబ్బెట్టుగా ఉందన్నారు. తనకు తాను గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ దాన్ని ఆయన మాత్రమే నమ్ముతూ…. చంద్రబాబు శాశ్వత చిత్తభ్రమలో ఉన్నారని కేవీపీ ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు వెంటనే మానసిక చికిత్స అందించాల్సిన అవసరం ఉందన్నారు.

చంద్రబాబుకు వచ్చిన వ్యాధి నయం కావాలంటే ఎర్రగడ్డ, ఎరవాడ ఆస్పత్రుల్లో ఇచ్చే చికిత్స సరిపోదన్నారు. చంద్రబాబుకు మెరుగైన వైద్యం అందించేందుకు స్విడ్జర్లాండ్ లేదా మసాచూసిట్స్‌కో వెంటనే తరలించాల్సిన అవసరం ఉందన్నారు కేవీపీ. పోలవరం ప్రాజెక్ట్ క్రెడిట్‌ మొత్తం తనకే దక్కాలన్న ఉద్దేశంతో చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయనుకోవడం చంద్రబాబు భ్రమేనన్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES