లక్ష్మీ భాయ్…. సూపర్ ఉమెన్

3480

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కి చెందిన ల‌క్ష్మీభాయ్ సూప‌ర్ ఉమెన్‌గా గుర్తింపు పొందింది. 72 ఏళ్ల వ‌య‌సులో కూడా అలుపెరుగకుండా టైపిస్ట్‌గా ప‌నిచేస్తోంది. డ‌బ్బులు సంపాదిస్తోంది. వ‌య‌సు ప‌నికి అడ్డురాద‌ని నిరూపించింది. ప‌నిలో ఆరితేరింది. చ‌క‌చ‌కా టైప్‌ చేస్తూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో సెహోర్ జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యం ముందు ఆమె చేస్తున్న టైపింగ్ గురించి తెలిసిన క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆమెపై ప్ర‌శంస‌లు కురిపించాడు. వృత్తి ప‌ట్ల ఆమె అంకిత భావాన్ని మెచ్చుకున్నాడు . ట్విట్ట‌ర్ ద్వారా స్పందించాడు. ల‌క్ష్మీభాయ్ ని సూప‌ర్ ఉమెన్ అని కీర్తించాడు. ఆమె టైప్ చేస్తున్న వీడియోను ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేశాడు. భార‌త‌దేశ యువ‌త ఆమె నుంచి చాలా నేర్చుకోవాల‌ని సూచించాడు.

ఏ ప‌నీ చిన్నది కాద‌ని….ప‌ని చేయ‌డానికి గానీ, ఏదైనా కొత్త విష‌యం నేర్చుకోడానికి గానీ వ‌య‌సు అడ్డంకి అస్స‌లు కాద‌ని ఆమె జీవితం చెబుతోంద‌ని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. సెహ్వాగ్ త‌న వీడియోను షేర్ చేసిన విష‌యం తెలుసుకున్న ల‌క్ష్మీభాయ్ సంతోషం వ్య‌క్తం చేసింది. తాను చేసిన అప్పులు తీర్చ‌డానికి క‌ష్ట‌ప‌డుతున్నాన‌ని, ఓ సొంతిల్లు లేక అవ‌స్థ‌లు ప‌డుతున్నాన‌ని ఆమె తెలిపింది.

గ‌తంలో త‌న కుమార్తెకు యాక్సిడెంట్ జ‌రిగిన‌పుడు అనేక మంది వ‌ద్ద అప్పులు చేశాన‌ని వాటిని తీర్చ‌డానికి ప్ర‌స్తుతం క‌ష్ట‌ప‌డుతున్నాన‌ని ల‌క్ష్మీభాయ్ తెలిపింది. క‌లెక్ట‌ర్ రాఘ‌వేంద్ర సింగ్ స‌హ‌కారంతో తాను జీవ‌నం సాగిస్తున్న‌ట్లు 72 ఏళ్ల ల‌క్ష్మీభాయ్ వివ‌రించింది.

NEWS UPDATES

CINEMA UPDATES